Balakrishna: బాలయ్య రిజెక్ట్ చేసిన సినిమాలు .. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం.. ఈ హీరోలకు వెరీవెరీ స్పెషల్

Nandamuri Balakrishna Rejected Movies: నందమూరి ఫ్యామిలీ వారసుడిగా వెండి తెరపై బాలకృష్ణ తాతమ్మ కల సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తండ్రి ఎన్టీఆర్ తో కలిసి దాన వీర శూర కర్ణ,..

Balakrishna: బాలయ్య రిజెక్ట్ చేసిన సినిమాలు .. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం.. ఈ హీరోలకు వెరీవెరీ స్పెషల్
Balakrsihna

Nandamuri Balakrishna Rejected Movies: నందమూరి ఫ్యామిలీ వారసుడిగా వెండి తెరపై బాలకృష్ణ తాతమ్మ కల సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తండ్రి ఎన్టీఆర్ తో కలిసి దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, అన్నదమ్ముల అనుబంధం  వంటి అనేక సినిమాల్లో నటించారు.  అనంతరం సాహసమే జీవితం సినిమాతో హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. మంగమ్మగారి మనవడు సినిమాతో మొదటి సూపర్ హిట్ ను అందుకుని తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఫేమ్ ను సంపాదించుకున్నారు. మాస్ , క్లాస్ సినిమాతోనే కాదు జానపద సినిమాల్లో కూడా బాలయ్య సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇక బాలకృష్ణ కోసమే దర్శక రచయితలు ప్రత్యేకంగా కథలను రూపొందిస్తారు అన్న సంగతి అందరికి తెలిసిందే. ఇదే విషయాన్నీ బాలకృష్ణను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రెడీ చేస్తామని పలువురు రచయితలు పలు సందర్భాల్లో చెప్పారు. కూడా అయితే బాలకృష్ణ సినీ కెరీర్ లో పలు సినిమాలను రిజెక్ట్ చేశారు. వాటిల్లో కొన్ని కథలు తనకు సూట్ కావని రిజెక్ట్ చేస్తే.. మరికొన్ని డేట్స్ ఎడ్జెస్ట్ కుదరక వదులుకున్నారు. బాలయ్య వదులుకున్న సినిమాలు చేసిన హీరోలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. అంతేకాదు.. ఈ సినిమాలు ఆ హీరోల కెరీర్ లో ఘన విజయాలుగా నిలిచిపోయాయి. ఈరోజు బాలకృష్ణ వదులుకున్న సినిమాలు ఏమిటి అనేవి తెలుసుకుందాం..
బజారు రౌడీ : ఈ సినిమా స్టోరీని బాలకృష్ణ కోసమే రెడీ చేశారట. అయితే కొన్ని కారణాలతో బాలకృష్ణ వద్దనుకున్నారట. దీంతో ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ మొదటి తనయుడు రమేష్ బాబు చేశాడు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది.
జానకీరాముడు: ఈ సినిమా కూడా మొదట బాలకృష్ణ చేయాలనుకున్నారు. కోడి రామకృష్ణ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో బాలయ్య కూడా వదులుకున్నారట. ఆ తర్వాత ఈ సినిమా నాగార్జున వద్దకు చేరుకుంది. నాగార్జునకు సూపర్ హిట్ ఇచ్చింది.
చంటి : ఈ సినిమా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ రీమేక్ .. పరుచూరి బ్రదర్స్.. ఈ కథను బాలకృష్ణ ను దృష్టిలో పెట్టుకుని రాశారట.. అయితే కథ నచ్చలేదని రిజెక్ట్ చేశారు. ఇదే కథతో చంటిగా వెంకటేష్ సూపర్ అందుకున్నారు.
సూర్యవంశం : వెంకటేష్ నటించిన సూర్య వంశం కూడా మొదటగా బాలకృష్ణ వద్దకే వెళ్ళింది.. అయితే అప్పటికే పెద్దన్నయ్య సినిమా చేసిన బాలయ్య.. అదే స్టోరీ నేపధ్యం అంటూ రిజెక్ట్ చేశారు. దీంతో వెంకటేష్ సూర్యవంశంతో మళ్ళీ హిట్ అందుకున్నారు.
సీతయ్య:  నందమూరి హరికృష్ణను హీరోగా ఓ రేంజ్ లో చూపించిన సినిమా సీతయ్య.. ఈ స్టోరీ ముందుగా బాలయ్య వద్దకు వెళ్లిందట.. అప్పటికే చెన్నకేశవ రెడ్డి, పల్నాటి బ్రహ్మ నాయుడు సినిమాలతో బిజీగా ఉండడంతో రిజెక్ట్ చేశారు.
సింహాద్రి: ఈ స్టోరీకూడా మొదటగా బాలకృష్ణ వద్దకు వెళ్లగా.. కథ నచ్చక రిజెక్ట్ చేయడంతో.. అదే స్టోరీతో జూ. ఎన్టీఆర్ కు కెరీర్ కు బ్లాక్ బస్టర్ ఇవ్వడం జరిగింది.
సింహరాశి: ఈ సినిమా స్టోరీని మొదట పరుచూరి బ్రదర్స్ బాలయ్యకు వినిపించారట.  అయితే బాలయ్య రిజెక్ట్ చేయడంతో రాజశేఖర్ ఈ సినిమాలో హీరోగా నటించి బాక్సాపీస్ వద్ద సక్సెస్ అందుకున్నారు.
క్రాక్: రవితేజకు సూపర్ హిట్ ఇచ్చిన క్రాక్ సినిమా కథను గోపీచంద్ మలినేని బాలయ్యకు వినిపించారట.. మొదట హోల్డ్ లో పెట్టి.. చివరకు కథ నచ్చలేదు అంటూ రిజెక్ట్ చేశారట. అలా క్రాక్ మూవీ రవితేజ వద్దకు చేరి.. వరస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రవితేజ కెరీర్ కు బూస్ట్ నిచ్చింది.
వకీల్ సాబ్ : పింకీ రీమేక్ గా తెరకెక్కి.. లాయర్ గా పవన్ కళ్యాణ్ ను ఓ రేంజ్ లో చూపించిన వకీల్ సాబ్  స్టోరీ కూడా దిల్ రాజు బాలయ్యకు వినిపించారట. అయితే కథ తన బాడీ లాంగ్వేజ్ కు సెట్ కాదని బాలయ్య సున్నితంగా తిరస్కరించారు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ గా వకీల్ సాబ్ తో సూపర్ హిట్ అందుకున్నారు.
భీమ్లా నాయక్ : ప్రస్తుతం పవన్ , రానాలు మల్టీస్టార్ గా నటిస్తున్న  భీమ్లా నాయక్  కూడా మొదట బాలకృష్ణ వద్దకు చేరుకుంది. అయితే తనకు రీమేక్ చేయడం ఇష్టం లేదని వద్దన్నారట.. మరి ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఏ రేంజ్ లో హిట్ అందుకుంటుందో చూడాలి మరి.

Also Read: Inspiring Person: పుట్టుకతోనే అవయవలోపం.. చేతులనే కాళ్ళగా మార్చుకుని చిరుతలా పరుగెత్తి.. గిన్నిస్ రికార్డ్ సృష్టించి…

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu