Most Eligible Bachelor: దసరా బరిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. రిలీజ్ డేట్ ప్రకటించిన అఖిల్.. ఎప్పుడంటే..

అక్కినేని అఖిల్.. పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై

Most Eligible Bachelor: దసరా బరిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. రిలీజ్ డేట్ ప్రకటించిన అఖిల్.. ఎప్పుడంటే..
Most Eligible Bachelor
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 26, 2021 | 1:36 PM

అక్కినేని అఖిల్.. పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై బ‌న్నీవాసు, వాసువ‌ర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ మూవీ మరోసారి అక్కినేని అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ సినిమాను ముందుగా అక్టోబర్ 8న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు చిత్రయూనిట్. తాజాగా ఆ తేదీ కాదని.. దసరా కానుకగా.. అక్టోబర్ 15వ తేదీన సినిమా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. దీంతో ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ విషయం కాస్త నిరాశ కలిగించే విషయమే.

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు సరైన హిట్ అందుకోలేక పోయాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అఖిల్ ఆశలన్నీ ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పైనే ఉన్నాయి. అటు అఖిల్‌, ఇటు భాస్కర్ కెరీర్‌కు కీల‌కంగా మార‌డంతో సినిమాకు ఎక్కడ‌లేని ప్రాధాన్యత వ‌చ్చింది. ఇక భాస్కర్ కూడా ఈ సినిమాను అంచ‌నాలు అందుకునే స్థాయిలోనే తెర‌కెక్కించార‌ని స‌మాచారం.. అలాగే ఇప్పటివరకు ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ యూట్యూబ్‏లో దూసుకుపోతున్నాయి. ఇందులో మ‌ని, ముర‌ళీశ‌ర్మ‌, వెన్నెల కిషోర్ మఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గోపీసుంద‌ర్ సంగీతం అందించారు. మొత్తానికి దసరా బరిలో ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా చేరిపోయాడు.

ట్వీట్..

Also Read: ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తోంది.. దక్షిణాదిలోనూ క్రేజ్ మాములుగా ఉండదు..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్.. ఫ్యాన్స్‏కు అదిరిపోయే న్యూస్..

Love Story: బాక్సాఫీస్ వద్ద లవ్ స్టోరీ ప్రభంజనం.. రెండవ రోజు కలెక్షన్స్ ఎంతంటే..

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!