Inspiring Person: పుట్టుకతోనే అవయవలోపం.. చేతులనే కాళ్ళగా మార్చుకుని చిరుతలా పరుగెత్తి.. గిన్నిస్ రికార్డ్ సృష్టించి…
Inspiring Person: కొంతమందికి అన్ని అవయవాలున్నా కష్టపడానికి ఇష్టపడరు. అదృష్టం కలిసి వచ్చి తమను అందలం ఎక్కించాలని.. కొండకు నిచ్చెనవేస్తూ.. ఊహల్లో బతికేస్తారు. లేదంటే ఎవరైనా..
Inspiring Person: కొంతమందికి అన్ని అవయవాలున్నా కష్టపడానికి ఇష్టపడరు. అదృష్టం కలిసి వచ్చి తమను అందలం ఎక్కించాలని.. కొండకు నిచ్చెనవేస్తూ.. ఊహల్లో బతికేస్తారు. లేదంటే ఎవరైనా సాయం చేయాలనీ ఎదురుచూస్తారు. అయితే మరికొందరు..జీవితం ఏదైనా సాధించాలనే తపన లేకుండా మనకు దక్కింది ఇంతే అంటూ నిరాశావాదంతో బతికేస్తారు. ఇటువంటివారికి ప్రేరణ ఇచ్చే విధంగా తమకు దేవుడు అన్ని అయవాలను సక్రమంగా ఇవ్వకపోయినా ఏదైనా సాధించాలనే సంకల్పం, ఆత్మ స్థైర్యంతో ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుని.. పట్టుదలతో తమకంటూ చరిత్ర పుటల్లో ఓ పేజీని లిఖించుకుంటున్నారు కొందరు. ఓ యువకుడు తనకు రెండు కాళ్ళు లేకపోయినా .. చేతులను కళ్ళగా మార్చుకుని అత్యంత వేగంగా పరిగెత్తి రికార్డ్ సృష్టించాడు. ఆ వ్యక్తి వేగాన్ని లెక్కకట్టిన గిన్నీస్ బుక్ రికార్డు ప్రతినిధులు.. అత్యంత వేగంగా పరుగెత్తే వ్యక్తిగా రికార్డు బ్రేక్ చేసాడని ప్రశంసల వర్ధం కురిపించారు. ఈ వీడియోను గిన్నిస్ బుక్ రికార్డ్స్ యూట్యూబ్ లో పోస్టు చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే..
యూఎస్ లో నివాసం ఉంటున్న జియాన్ క్లార్క్ అనే 23 ఏళ్ల యువకుడు అవయవ లోపంతో పుట్టాడు. అతనికి పుట్టుకతోనే రెండు కాళ్లు లేవు. రెండు చేతులు మాత్రమే ఉన్నాయి. ఇలా జన్మించడానికి కారణం కాడల్ రిగ్రెషన్ అనే సిండ్రోమ్ కారణమని వైద్యులు చెప్పారు. చాలా అరుదుగా మనుషులకు వచ్చే జెనెటిక్ డిజార్డర్ అని వైద్యులు తెలిపారు. అయితే జియోన్ తల్లిదండ్రులు అవయవ లోపంతో పుట్టిన తమ కుమారుడిని చూసి కుంగి పోలేదు.. దీంతో జియోన్ కూడా చిన్నతనం నుంచి కూడా తనకి కాళ్లు లేవని ఎప్పుడు బాధ పడలేదు. వాకింగ్ స్టిక్స్ సాయంతో నడవాలని కూడా అనుకోలేదు. దీంతో తనకు కాళ్ళు లేకపోయినా దేవుడి ఇచ్చిన చేతులున్నాయి కదా అని ఆలోచించాడు. కాళ్లతో చేసే పనులను.. చేతులతో కూడా చేయడం నేర్చుకున్నాడు. చేతులనే కాళ్ళగా మార్చుకుని నడవడం నేర్చుకున్నాడు. అంతేకాదు.. రోజూ జిమ్ కు వెళ్లి వర్క్ ఔట్స్ చేసేవాడు. దీంతో జియోన్ ను చిన్నతనం నుంచి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. ఎలాగైనా రెజ్లర్, అథ్లెట్ లేదంటే ఒలింపిక్స్ లో గాని మెడల్ సంపాదించాలని అనుకునేవాడు. అందుకు తగిన విధంగా చిన్నతనం నుంచి చదువుకునే స్కూల్ లో క్రీడకారుడిగా పలు ఆటల్లో చురుగ్గా పాల్గొనేవాడు. మల్లయోధుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే గ్రౌండ్ లో దిగి ప్రాక్టీస్ కూడా చేసేవాడు.
జియోన్ తన చేతులతో వేగంగా పరుగెత్తగల వ్యక్తిగా రికార్డును అధిగమించడానికి ప్రయత్నం చేశాడు. కేవలం 20 మీటర్లను 4.78 సెకండ్లలో చేతులతో అత్యంత వేగంగా పరిగెత్తి గిన్నీస్ బుక్ లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇదే విషయంపై జియోన్ స్పందిస్తూ.. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. అంతేకాదు ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం ఎంచుకుని దానిని సాధించే దిశగా కృషిచేయాలని చెప్పాడు. అంతేకాదు తన రికార్డ్ ను తానే మళ్ళీ బ్రేక్ చేయడానికి రెడీ అవుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. సంతోషాన్ని జియాన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నాడు. ప్రస్తుతం జియోన్ ఆత్మస్తైర్యం, పట్టుదలపై నెటిజన్లు తమ కామెంట్స్ తో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram
Also Read: KFC Fried Chicken Recipe: నాన్ వెజ్ ప్రియులకోసం సండే స్పెషల్.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే ‘కేఎఫ్‌సీ చికెన్’ తయారీ