AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KFC Fried Chicken Recipe: నాన్ వెజ్ ప్రియులకోసం సండే స్పెషల్.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే ‘కేఎఫ్‌సీ చికెన్’ తయారీ

KFC Fried Chicken Recipe in Telugu: నాన్ వెజ్ ప్రియులకు ఆదివారం వచ్చిందంటే చాలు.. చికెన్ ముక్కలేకపోతే ముద్ద నోట్లోకి పోదు.. అయితే ఈ చికెన్ ను ఎప్పుడూ ఒకే రకంగా వండినా..

KFC Fried Chicken Recipe: నాన్ వెజ్ ప్రియులకోసం సండే స్పెషల్..  రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే 'కేఎఫ్‌సీ చికెన్' తయారీ
Kfc Chicken
Surya Kala
|

Updated on: Sep 26, 2021 | 12:08 PM

Share

KFC Fried Chicken Recipe in Telugu: నాన్ వెజ్ ప్రియులకు ఆదివారం వచ్చిందంటే చాలు.. చికెన్ ముక్కలేకపోతే ముద్ద నోట్లోకి పోదు.. అయితే ఈ చికెన్ ను ఎప్పుడూ ఒకే రకంగా వండినా ఇంట్లో పిల్లల నుంచి , పెద్దల వరకూ వారం వారం ఇదేనా బోర్ కోరుకుంటుంది. రెస్టారెంట్ కు పోదామనో.. లేదంటే కేఎఫ్‌సీ చికెన్ ఆర్డర్ పెట్టుకుందామనో అంటారు.  ఎందుకంటే విదేశీ వంటకాలైన కేఎఫ్‌సీ చికెన్, చికెన్ మంచూరియా వంటివి మనదేశంలో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. పిల్లలకు పెద్దలకు ఇష్టమైన ఫుడ్ ఐటెంగా మారిపోయాయి. అయితే రెస్టారెంట్ కు వెళ్ళడానికి ప్రస్తుత పరిస్థితుల్లో అంతగా ఆసక్తి చూపించడం లేదు.  దీంతో పిల్లల కోసం రెస్టారెంట్ స్టైల్ లో కేఎఫ్‌సీ చికెన్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.  అయితే ఇలా తయారు చేసుకోవడానికి కొంచెం సమయం కేటాయించాల్సి ఉంటుంది అంతే.. దీని వలన ఇంట్లో వాళ్లకు బయటకు ఫుడ్ తినే అలవాటు తగ్గుతుంది.  ఎటువంటి వాటితో ఫుడ్ తయారు చేశారో అన్న భయం లేకుండా కావాల్సినంత హ్యాపీగా తినచ్చు కూడా.. ఈరోజు సండే స్పెషల్ గా కేఎఫ్‌సీ చికెన్ తయారీ గురించి తెలుసుకుందాం..

కావలసిన పదార్ధాలు:

చికెన్ ముక్కలు (స్కిన్ తో) – అర కేజీ గుడ్లు – 2 మైదా – రెండు కప్పులు అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం ఉల్లిపాయ పౌడర్ – 2 స్పూన్లు ఓట్స్ పిండి – 2  స్పూన్లు లేదా (కార్న్ ప్లోర్) బ్రెడ్ ముక్కలు బేకింగ్ పౌడర్ ఉప్పు కొంచెం

చికెన్ మర్నెంట్ (నానబెట్టడానికి) చేయడానికి

మజ్జిగ – కొంచెం నిమ్మరసం – 1 స్పూన్ కారం –  అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి కొంచెం ఉప్పు రుచికి సరిపడా నూనె – ఫ్రై చేయడానికి తగినంత

తయారీ విధానం: ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి నీరు పోయేవిధంగా  ఒక మంచి బట్టమీద పెట్టుకోవాలి. అలా నీరు పోయిన తర్వాత చికెన్ ను ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో కొంచెం మజ్జిగ , నిమ్మరసం, కారం, మిరియాల పొడి, ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు కలిసేలా చేసి.. తర్వాత చికెన్ ను లా రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి.  ఇప్పుడు గిన్నె తీసుకొని దానిలో మైదాపిండి,  అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పౌడర్, కారం, మిరియాల పొడి, బ్రెడ్ ముక్కలు, ఓట్స్ పొడి, బేకింగ్ పౌడర్  .. చివరగా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని.. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.  ఇలా రెడీ చేసుకున్న పౌండరు లో నానబెట్టుకున్న చికెన్ ముక్కలను ముంచి.. ఈ మిశ్రమం చికెన్ కు బాగా పట్టేలా చూసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలో రెండు గుడ్లు పగలగొట్టి.. పాలు పోసి మిశ్రమం మెత్తగా అయ్యేలా మిక్స్ చేయాలి.  ఇలా అన్ని రెడీ అయినా తర్వాత

స్టౌ వెలిగించి బాణలి పెట్టి.. వేయించడానికి సరిపడే నూనెను వేసుకోవాలి. నూనె వేడి ఎక్కిన తర్వాత మిశ్రమంలో పెట్టుకున్న చికెన్ ముక్కలను ఒకొక్కటి తీసుకుని.. గిన్నెలో రెడీ చేసుకున్న గుడ్లు పాల మిశ్రమంలో ముంచాలి.. ఇలా గుడ్లలో ముంచిన చికెన్ ముక్కలను వేడి నూనెలో వేసుకుని.. మీడియం ఫేమ్ మీద వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకూ చికెన్ ను వేయించుకుని.. వాటిని నూనె నుంచి తీసి.. ఒక ప్లేట్ లో టిష్యు పేపర్ వేసి.. వాటి మీద ఈ చికెన్ పీసెస్ ను వేసుకోవాలి. దీంతో చికెన్ కు ఉన్న నూనె ఆ టిష్యు పేపర్ పీల్చుకుంటాయి. అంతే రెస్టారెంట్ స్టైల్ లో  ఘుమఘుమలాడే కేఎఫ్‌సీ చికెన్ రెడీ.. వీటిని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని.. ఉల్లిపాయ ముక్కలను, నిమ్మకాయను, టమాటా సాస్ కలిపి తింటే.. ఇక ఎప్పుడూ రెస్టారెంట్ వైపు చూడకుండా ఇంట్లోనే చేయమని అడగడం ఖాయం..

Also Read: తండ్రి సైకిల్ మీద బట్టలను అమ్మే నిరుపేద.. పట్టుదలతో ఐఎస్ఎస్‌కు ఎంపికైన తనయుడు..