Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi in US: ఢిల్లికి చేరుకున్న ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన ప్రజలు..

PM Modi Reaches Delhi: అమెరికా పర్యటన ముగించుకొని భారత్‌కు చేరుకున్నారు ప్రధాని మోదీ. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం లభించింది. పలువురు మంత్రులు, అధికారులతో పాటు బీజేపీ శ్రేణులు, పెద్ద సంఖ్యలో

PM Modi in US: ఢిల్లికి చేరుకున్న ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన ప్రజలు..
Pm Modi
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 26, 2021 | 1:06 PM

అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించుకున్న ప్రధాని మోడీ  కొద్దిసేపటి క్రితమే భారత్‌కు చేరుకున్నారు. దేశ రాజధాని ఢిల్లో ఎయిర్‌పోర్టులో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు పార్టీ సభ్యులు ప్రధాని మోడీకి గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికారు.

ఇక వేలాది మంది కమలం శ్రేణులు, ప్రధాని మోడీ మద్దతుదారులు భారీగా విమానాశ్రయానికి వచ్చారు. పలువురు కళాకారులు డప్పు వాయిద్యాలు, మహిళల డాన్సుల మధ్య ఆనందోత్సాహాలతో మోదీకి స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున కాషాయ జెండాలు, ప్రదాని మోడీ ఫ్లెక్లీలతో ఎయిర్‌పోర్ట్‌ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ నెల 22న అమెరికాకు పయనమైన ప్రధాని..23న అగ్రరాజ్యంలో ల్యాండయ్యారు. వాషింగ్టన్‌ డీసీ ఎయిర్‌పోర్టులో ఎన్నారైలు గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికారు. ఆ తర్వాత ముందుగా అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హ్యారిస్‌, ఆ తర్వాత అధ్యక్షుడు జో బైడెన్‌తో కీలక అంశాలపై చర్చలు జరిపారు. వాణిజ్యం, రక్షణ సంబంధాల బలోపేతంతో పాటు ఉగ్రవాదం నిర్మూలన, కరోనా మహమ్మారిపై కలిసి పోరాడాలని నిర్ణయించారు. ఇక అంతకుముందు పలు దిగ్గజ కంపెనీల సీఈవోలతోనూ సమావేశమయ్యారుర.

ఇక అమెరికా మూడ్రోజుల పర్యటనలో వరుస సమావేశాలతో బిజీబిజీగా గడిపారు ప్రధాని. క్వాడ్‌ సదస్సు, ఐక్యరాజ్యసమితిలో కీలక ప్రసంగం చేశారు. ఐక్యరాజ్యసమితి సాక్షిగా పాకిస్తాన్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. కొన్ని దేశాలకు ఉగ్రవాదం ఆయుధంగా మారిందని విమర్శించారు. టెర్రరిజాన్ని ఆయుధంగా మార్చుకున్న దేశాలు సర్వనాశనం అవుతాయని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్‌ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారకూడదన్నారు ప్రధాని మోడీ.

ఆఫ్ఘన్‌ మహిళలను , పిల్లలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రపంచదేశాలపై ఉందన్నారు. భారత సముద్రతీరం ప్రపంచ వాణిజ్యానికి వెన్నెముకగా ఉంటే .. కొన్ని దేశాల తీరం మాత్రం ఉగ్రవాదం ఎగుమతికి ఉపయోగపడుతోందని పాకిస్తాన్‌ను పరోక్షంగా విమర్శించారు. టెర్రరిజం ప్రపంచానికే పెనుముప్పుగా మారిందన్నారు ప్రధాని మోడీ. అభివృద్ది కోసం ప్రపంచదేశాలు ఏకం కావాలన్నారు.

కరోనా లాంటి సంక్షోభం గత వందేళ్లలో ప్రపంచం ఎప్పుడు చూడలేదన్నారు . టీకా కంపెనీలు వ్యాక్సిన్ల తయారీ కోసం భారత్‌కు రావాలని ఆహ్వానించారు ప్రధాని మోడీ. తొలి DNA వ్యాక్సిన్‌ను ప్రపంచానికి అందించిన ఘనత భారత్‌దే అన్నారు.

ఇవి కూడా చదవండి:  AP Government: ఇక ఏపీలో అది కుదరదంటే.. కుదరదు.. కొత్త చట్టం తీసుకొచ్చే యోచనలో సర్కార్..

Elon Musk: ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు బ్రేకప్ చెప్పాడు.. 3 ఏళ్ల బంధం విడిపోవడానికి కారణం అదేనట..