Success Story: తండ్రి సైకిల్ మీద బట్టలను అమ్మే నిరుపేద.. పట్టుదలతో ఐఎస్ఎస్‌కు ఎంపికైన తనయుడు..

Success Story: కృషి, పట్టుదల ఉంటే ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా పరిస్థితులు అనుకూలించకపోయినా జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి అడ్డుకావని నిరూపించి.. చరిత్రలో..

Success Story: తండ్రి సైకిల్ మీద బట్టలను అమ్మే నిరుపేద.. పట్టుదలతో ఐఎస్ఎస్‌కు ఎంపికైన తనయుడు..
Anil Bosak Family

Success Story: కృషి, పట్టుదల ఉంటే ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా పరిస్థితులు అనుకూలించకపోయినా జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి అడ్డుకావని నిరూపించి.. చరిత్రలో నిలిచిపోయినవారు ఎందరో మహానుభావులు ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని ఘన విజయం సాధించడానికి సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి పేదరికం ఏ మాత్రం అడ్డుకాదని నిరూపించాడు ఓ యువకుడు. దేశంలోనే అత్యున్నత కొలువులుగా భావించే సివిల్స్ లో 45వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. కొంతమంది యువకులకు అన్ని సదుపాయాలున్నా.. ఇంకా ఎదో తక్కువ అంటూ నిరాశతో బతికేవారు మాత్రమే కాదు.. పేద కుటుంబంలో పుట్టి తమకు ఏమీ లేకపోయినా.. విజయం సాధించడానికి పేదరికం అడ్డుకాదని నిరూపించి పదిమందికి ఆదర్శంగా నిలిచాడు అనిల్ బోసక్ … ఈరోజు అతని సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం..

బీహార్ లోని కిషన్ గంజ్ జిల్లాలో చెందిన అనిల్ బోసక్ సివిల్స్ 2020 ఫలితాల్లో 45వ ర్యాంకును సాధించాడు. అత్యంత పేద కుటుంబంలో జన్మించిన అనిల్ అకుంఠిత దీక్షతో ఐఏఎస్ కు ఎంపికయ్యాడు. అనిల్ తండ్రి బినోద్ బోసక్ సైకిల్ మీద బట్టలు పెట్టుకుని ఇంటింటికి తిరుగుతూ బట్టలను అమ్ముతాడు. బినోద్ చాలనీ చాలని సంపాదనే కుటుంబానికి ఆధారం. తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన అనిల్ చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. తన కుమారుడు ఇప్పుడు సివిల్స్ లో సాధించిన విజయాన్ని … కొడుకు ఐఏఎస్ అవ్వడంతో అనిల్ కుటుంబంలో సంతోషం తాండవిస్తుంది.

Anil 2

Anil 2

తన కొడుకు సాధించిన విజయం గురించి బినోద్ మాట్లాడుతూ.. అనిల్ మొదట ఐఐటీకి ఎంపికయ్యాడు. అప్పుడు మేము చాలా సంతోషించాము. అంతేకాదు ఇక ఉద్యోగం చేస్తాడని భావించాము.. అయితే అనిల్ తనకు ఉద్యోగం చేయడం ఇష్టంలేదని.. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతానని చెప్పారు. కొడుకు నిర్ణయం తనకు మొదట చాలా కష్టమనిపించింది. అయితే అనిల్ చదువు కోసం అతని టీచర్ కూడా అతనికి చాలా సహాయం చేశారు. ఉపాధ్యాయులు చాలామంది అనిల్ సివిల్స్ కోసం ఆర్ధిక సహాయం కూడా చేశారు. ఇదే విషయం పై అనిల్ సోదరుడు బాబుల్ బోసాక్ స్పందిస్తూ.. అనిల్ ఇది మూడోసారి సివిల్స్ రాయడం.. గత ఏడాది సివిల్స్ లో అనిల్ కు 616 వ ర్యాంక్ వచ్చింది. దీంతో అనిల్ మళ్ళీ సివిల్స్ కు ప్రిపేట్ అవుతానని అన్నాడు.. మూడో సారి 45 వ ర్యాంక్ ను సొంతం చేసుకుని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడని గర్వంగా చెప్పారు. అంతేకాదు ఇప్పటికీ అనిల్ విజయం తనకు కలగానే ఉందని.. ఇది మొత్తం తన కుటుంబానికే కాదు జిల్లాకే గర్వకారణం” అని చెప్పారు.

Anil

Anil

అనిల్ బోసక్ ఐఐటీ ఢిల్లీ నుంచి 2018లో పట్టా పుచ్చుకున్నారు. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం చేయాలనే ఆలోచనను పక్కన పెట్టి, సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడు. మూడో అటెంప్ట్ లో సివిల్స్ ను క్రాక్ చేశాడు. కొంతమంది తమకు ఉన్నదానితో తృప్తి పడితే.. మరికొందరు తమకంటూ ఓ లక్షాన్ని నిర్ధేశించుకుంటారు.. ఆ లక్ష్యం అందుకోవడానికి పట్టుదలతో కృషి చేస్తారు. అనుకున్నది సాధిస్తారు. పదిమందికి ఆదర్శంగా నిలుస్తారు.

Also Read: Rent A Girlfriend: అమ్మానాన్నల కోసం అద్దెకు గర్ల్ ఫ్రెండ్.. లక్షల్లో ఖర్చు చేస్తున్న యువత ఎక్కడంటే..

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu