Rent A Girlfriend: అమ్మానాన్నల కోసం అద్దెకు గర్ల్ ఫ్రెండ్.. లక్షల్లో ఖర్చు చేస్తున్న యువత ఎక్కడంటే..

Rent A Girlfriend: ఇప్పటి వరకూ అద్దెకు ఇల్లు, కార్లు, సైకిల్స్, స్థలాలను రెంట్ కి ఇస్తారని తెలుసు.. అయితే ప్రేమికుల రోజు కోసం  ప్రేమికులను అద్దెకు ఇచ్చే సంప్రదాయం కూడా మొదలైంది..

Rent A Girlfriend: అమ్మానాన్నల కోసం అద్దెకు గర్ల్ ఫ్రెండ్.. లక్షల్లో ఖర్చు చేస్తున్న యువత ఎక్కడంటే..
Girl Friend Rent
Follow us

|

Updated on: Sep 26, 2021 | 10:27 AM

Rent A Girlfriend: ఇప్పటి వరకూ అద్దెకు ఇల్లు, కార్లు, సైకిల్స్, స్థలాలను రెంట్ కి ఇస్తారని తెలుసు.. అయితే ప్రేమికుల రోజు కోసం  ప్రేమికులను అద్దెకు ఇచ్చే సంప్రదాయం కూడా మొదలైంది. కానీ ఇప్పుడు ప్రేమికురాలితో చిన్న చిన్న సరదాలు తీర్చుకోవానికి.. అమ్మానాన్నల కోరిక తీర్చడానికి  గర్ల్ ఫ్రెండ్ ని కూడా అద్దెకిస్తారని మీకు తెలుసా? ఏంటీ ‘అద్దెకు గర్ల్ ఫ్రెండా’? అని షాక్ అవుతున్నారా? ఇలా గర్ల్ ఫ్రెండ్ ను అద్దెకు ఇచ్చే సౌకర్యం చైనా,జపాన్, తైవాన్ వంటి పలు దేశాల్లో ఉంది. అయితే సాధారణంగా గర్ల్‌ఫ్రెండ్‌తో తిరుగుతుంటే తల్లిదండ్రులు మందలిస్తుంటారు. కానీ  డ్రాగన్ కంట్రీలో  అలా కాదు. గర్ల్‌ఫ్రెండ్స్ లేరనే కారణంతో  ఇంకొక అడుగు ముందుకు వేసి.. తమ పిల్లలకు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే తిడుతున్నారట. దీంతో తల్లిదండ్రుల కేకలు, తిట్లు తప్పించుకునేందుకు అద్దెకు గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఎరేంజ్ చేసుకుని తల్లిదండ్రులనుంచి తప్పించుకుంటున్నారట. ఇలా అద్దెకు గర్ల్ ఫ్రెండ్ ను ఇచ్చే   యాప్స్ చైనా లో అందుబాటులో ఉన్నాయి.  అయితే ఇలా అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌లా నటించే అమ్మాయిలు మాత్రం ఇది చాలా కష్టమైన పని అంటున్నారు.  ప్రతిసారీ అపరిచిత వ్యక్తులతో గర్ల్‌ఫ్రెండ్‌లా నటించాల్సి రావడంకొంచెం ఇబ్బంది అని వాపోతున్నారు.

చైనాలో లూనార్ న్యూ ఇయర్ నాడు మాత్రం గర్ల్‌ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకోవడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోతుంది. ఆ సమయంలో గర్ల్‌‌ ఫ్రెండ్‌ను రెంట్ కు తీసుకునేందుకు మన దేశ కరెన్సీలో రూ. 34, 241 నుంచి రూ.  1 లక్షా 14 వేల వరకూ ఖర్చు అవుతుందట. ముఖ్యంగా చైనా న్యూ ఇయర్ రోజున తమ కుటుంబంతో గడపడానికి ఎక్కువమంది యువకులు సెలవులపై ఇంటికి వెళ్తుంటారు.  ఆ సమయంలో అత్యధిక శాతం చైనా యువత అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకుంటున్నారు.  అమ్మాయిని తమతో ఇంటికి తీసుకుని వెళ్లకపోతే  తల్లిదండ్రుల్నించి, బంధువుల్నించి ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంటుంది.  దీంతో తప్పనిసరిగా చైనా యువత అద్దెకు గర్ల్ ఫ్రెండ్ ను ఆశ్రయిస్తున్నారు, ఇలా అద్దెకు తీసుకున్న చాలా సందర్బాల్లో పెళ్లిళ్లు, గర్ల్‌ఫ్రెండ్ వ్యవహారంలో బంధువుల్నించి అభ్యంతరాలను చైనా యువకులు ఎదుర్కొంటుంటారు.

అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకునేందుకు చైనా యువకులు వేల నుంచి లక్షల వరకూ ఖర్చు చేస్తున్నారు. అద్దెకు గర్ల్‌ఫ్రెండ్ సెట్ చేసుకోవాలంటే షరతులుంటాయి. ఇలా  గర్ల్‌ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకునే వ్యక్తి ఆ అమ్మాయికి ఇష్టమైన విధంగా నడుచుకోవాల్సి ఉంటుంది. అద్దె గర్ల్‌ఫ్రెండ్‌ చేయి పట్టుకోవచ్చు,కౌగిలించకోవచ్చు. ఇవన్నీ రూల్స్‌లో నోట్ చేసినట్లుగానే ఉండాలి తప్ప అడ్వాంటేజ్ తీసుకోకూడదు. అద్దెకు తీసుకున్న గర్ల్ ఫ్రెండ్ తో డేట్‌కు వెళ్లవచ్చు. ఇంటికి తీసుకెళ్లవచ్చు. చాటింగ్ కూడా చేయవచ్చు. ఆమెకు ఇష్టమైతే ముద్దు కూడా పెట్టుకోవచ్చు. ఇష్టం లేకపోతే ముద్దు పెట్టుకోవడానికేకాదు..శరీరంపై ఎక్కడిపడితే అక్కడికి చేతులు వేయకూడదు. ఈ నిబంధనలన్నింటికీ ఒప్పుకుని సంతకం కూడా పెట్టి గర్ల్ ఫ్రెండ్ ను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అద్దెకు తీసుకున్న అమ్మాయితో మిస్ బిహేవ్ చేస్తే.. కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Also Read: Tamarind Seeds: సిరులను కలిపిస్తున్న చింత గింజలు.. ఆన్ లైన్‌లో అమ్మకానికి పెట్టేసిన సంస్థలు..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ