Afghanistan: రెచ్చిపోతున్న తాలిబన్లు.. నరికివేయడం, భారీ క్రేన్లతో నగరం నడిబొడ్డున వేలాడదీయం

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల తీరు ఎప్పటికి మారదు. నేరస్తులకు బహిరంగశిక్షలు విధిస్తామన్న తాలిబన్లు అతిక్రూరంగా శిక్షలు అమలు చేస్తున్నారు. హెరాత్‌ నగరంలో ఓ వ్యాపారిని...

Afghanistan: రెచ్చిపోతున్న తాలిబన్లు.. నరికివేయడం, భారీ క్రేన్లతో నగరం నడిబొడ్డున వేలాడదీయం
Afghanistan Taliban

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల తీరు ఎప్పటికి మారదు. నేరస్తులకు బహిరంగ శిక్షలు విధిస్తామన్న తాలిబన్లు అతిక్రూరంగా శిక్షలు అమలు చేస్తున్నారు. హెరాత్‌ నగరంలో ఓ వ్యాపారిని కిడ్నాప్‌ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని బహిరంగంగా కాల్చిచంపారు తాలిబన్లు.. అంతేకాదు వాళ్ల మృతదేహాలను భారీ క్రేన్లతో నగరం నడిబొడ్డున వేలాడదీశారు. ఈ ఘటనతో స్థానికులు వణికిపోయారు. చిన్నపిల్లలు, మహిళలు అన్న తేడా లేకుండా తాలిబన్లు శిక్షలను అమలు చేస్తున్నారు. మరణశిక్షలు అమలు చేయడంలో కూడా తాలిబన్లు కొత్త కొత్త పద్దతులు వాడుతున్నారు. ఉగ్రవాదులకే దడ పుట్టించే విధంగా ఈ శిక్షలు అమలవుతున్నాయి. మానవత్వాన్ని మంట గలిపేస్తున్నారు ఈ ముష్కరులు . ప్రజలకు స్వేచ్చ లేకుండా చేస్తున్నారు. అసలు ఆఫ్ఘనిస్తాన్‌లో ఎందుకు పుట్టామా ? అన్న బాధలో ఉన్నారు అక్కడి ప్రజలు. హెరాత్‌తో పాటు అన్ని నగరాల్లో కూడా ఇలాంటి శిక్షలే అమలు చేస్తున్నారు. దొంగతనం చేశారన్న నెపంతో ప్రజలు చేతులు నరికివేయడం.. మగవాళ్లు తోడు లేకుండా బయటకు వచ్చారన్న సాకుతో మహిళలను కొరడా దెబ్బలు కొట్టడం తాలిబన్లకు అలవాటుగా మారింది.

మీడియాపై కూడా తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికా సైన్యం ఆఫ్ఘన్‌ను విడిచిపెడుతున్న సమయంలో పత్రికా స్వేచ్చను గౌరవిస్తామన్న తాలిబన్లు ఇప్పుడా మాట తప్పారు. మీడియాపై 11 కఠిన నియమాలు పెట్టారు. మతపెద్దలను కించపర్చే విధంగా రాస్తే అంతుచూస్తామని హెచ్చరించారు. తాలిబన్ల అరాచకం కారణంగా మహిళలు ఉద్యోగాలు మానేశారు. ఆడపిల్లలు చదువుకు దూరమయ్యారు. స్కూళ్లలో మగపిల్లలు, ఆడపిల్లలకు వేర్వేరుగా క్లాస్‌లు నిర్వహిస్తామన్న తాలిబన్లు ..కొత్త కొత్త నియమాలు తెస్తున్నారు. పంజ్‌షేర్‌ వ్యాలీలో తాలిబన్ల అమానుషం మరింత పెరిగింది. చిన్నపిల్లలను కూడా దారుణంగా హింసిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోంది. ఈవిషయంలో భారత్‌ ఆందోళన నిజమవుతోంది. ఓవైపు ఆఫ్ఘన్‌ ప్రజలు తిండి కోసం తిప్పలు పడుతుంటే తాలిబన్లు మాత్రం వాళ్లకు నరకం చూపిస్తున్నారు.

Also Read: వరుడు తాళి కడుతుంటే.. మంగళ సూత్రం విసిరికొట్టిన వధువు… చివర్లో మాములు ట్విస్ట్ కాదు

 బతికున్న పామును మింగిన వ్యక్తి.. ఆ తర్వాత షాకింగ్

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu