Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు బ్రేకప్ చెప్పాడు.. 3 ఏళ్ల బంధం విడిపోవడానికి కారణం అదేనట..

ప్రపంచ కుబేరుడు టెస్లా వ్యవస్థాపకుడు CEO ఎలోన్ మస్క్ మరోసారి విడిపోయాడు. మూడు సంవత్సరాల సంబంధం తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ గ్రిమ్స్‌కు బ్రేకప్ చెప్పాడు.

Elon Musk: ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు బ్రేకప్ చెప్పాడు.. 3 ఏళ్ల బంధం విడిపోవడానికి కారణం అదేనట..
World Richest Elon Musk
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 26, 2021 | 7:53 AM

ప్రపంచ కుబేరుడు టెస్లా వ్యవస్థాపకుడు CEO ఎలోన్ మస్క్ మరోసారి విడిపోయాడు. మూడు సంవత్సరాల సంబంధం తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ గ్రిమ్స్‌కు బ్రేకప్ చెప్పాడు. ఎలోన్ మస్క్ ఈ సమాచారాన్ని ‘పేజ్ సిక్స్’ తో షేర్ చేసుకున్నాడు. తన బంధం ముగిసిందని వెల్లడించాడు. ఈ జంటకు కానీ ఇప్పటికీ ఒకరినొకరు ప్రేమిస్తున్నారు. ఒకరినొకరు చూస్తూనే ఉన్నారు. కెనడియన్ గాయకురాలు గ్రిమ్స్ (33), మస్క్ (50) లకు ఎక్స్​ఆయ్​ఎయ్​ (X A-Xii) అనే ఒక ఏళ్ల కుమారుడు ఉన్నాడు. మస్క్, గ్రిమ్స్ మే 2018 లో మొదటిసారి కలుసుకున్నారు. వారి కుమారుడు మే 2020 లో జన్మించాడు. మస్క్ తన కొడుకు పేరు పెట్టిన సందర్బంలో చాలా చర్చ జరిగింది. మస్క్ , గ్రిమ్స్ చివరిసారిగా ఈ నెల ప్రారంభంలో మెట్ గాలాలో కలిసి కనిపించారు. గ్రిమ్స్ ఒంటరిగా రెడ్ కార్పెట్‌కు హాజరయ్యాయింది. కానీ ఈ కార్యక్రమంలో మస్క్ కనిపించలేదు.

పని ఒత్తిడి కారణంగా బ్రేకప్.. 

అయితే విడిపోతున్న ప్రకటన చేసిన మస్క్… ఇందుకు గల కారణాలను కూడా స్పష్టం చేశాడు. “మేము విడిపోతున్నాము. కానీ పుర్తిగా విడిపోవడం లేదు. మేము ఇంకా ప్రేమలోనే ఉన్నాము. అప్పుడప్పుడు కలిస్తూ ఉంటాం. మా మధ్య అంతా బాగానే ఉంది. స్పేస్​ఎక్స్​, టెస్లా కోసం నేను ఎక్కువ పనిచేయాల్సి ఉంటుంది. అది కూడా టెక్సాస్‌కు వెళుతూ ఉండాలి. గ్రిమ్స్​ ఇక్కడ(లాస్​ఏంజెల్స్​) ఉంటుంది. ప్రస్తుతానికైతే నా దగ్గరే ఉంటోంది.”

రెండు సార్లు వివాహం.. రెండు సార్లు విడాకాలు.. 

మస్క్ గతంలో కెనడియన్ రచయిత జస్టిన్ విల్సన్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఐదుగురు కుమారులు ఉన్నారు. అతను వెస్ట్‌వరల్డ్ నటి తులాల రిలేతో వివాహం చేసుకున్నాడు. మస్క్ 2010 లో మొదటిసారి రిలేను వివాహం చేసుకున్నాడు. 2012 లో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత 2013 లో మస్క్ , రిలే మళ్లీ వివాహం చేసుకున్నారు. 2016 లో వారు మళ్లీ విడాకులు తీసుకున్నారు.

మాట్లాడకపోడంతో చెవిటి వాడని..

టెస్లా స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడైన ఎలెన్ మస్క్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ను దాడిపోయాడు. ఎలెన్ మస్క్ సంపద నికర విలువ జనవరిలో 188.8 బిలియన్ డారల్లు. ఇది ఇండియన్ కరెన్సీలో రూ. 14.13 లక్షల కోట్లు. ఎలెన్ మస్క్ కు దక్షిణాఫ్రికా కెనడా అమెరికాలో పౌరసత్వం ఉంది. ఈయన 12 ఏళ్ల వయసులోనే బ్లాస్టర్ అే గేమ్ ను రూపొందించి విక్రయించాడు. అప్పటి నుంచే సొంతంగా రాకెట్ తయారు చేసుకోవాలని కలలు కనేవాడు. అప్పటి నుంచి ఉన్న ఆసక్తితోనే స్పేస్ ఎక్స్ ను స్థాపించాడు. చిన్నప్పుడు ఎక్కువగా మాట్లాడకపోడంతో ఎలెన్ మస్క్ చెవిటి వాడని తన తల్లిదండ్రులు భావించేవారట. టెస్లా కంపెనీ ఎలక్ట్రికల్ కార్లను తయారు చేస్తుంది. ఈ కంపెనీ షేర్ విలువ 811 డాలర్ల గరిష్ట స్థాయికి చేరడంతో అతికొద్ది కాలంలోనే ధనవంతుడయ్యాడు.

ఇవి కూడా చదవండి: Mahesh Babu: అస‌లు సాయిప‌ల్ల‌వికి ఎముక‌లు ఉన్నాయా..? ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన మ‌హేష్ బాబు.

AP Government: ఇక ఏపీలో అది కుదరదంటే.. కుదరదు.. కొత్త చట్టం తీసుకొచ్చే యోచనలో సర్కార్..