Mahesh Babu: అస‌లు సాయిప‌ల్ల‌వికి ఎముక‌లు ఉన్నాయా..? ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన మ‌హేష్ బాబు.

Mahesh Babu: నాగ చైత‌న్య, సాయి ప‌ల్ల‌వి జంట‌గా తెర‌కెక్కిన సినిమా ల‌వ్ స్టోరీ. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆశించిన స్థాయిలోనే ఆక‌ట్టుకుంటోంది. శేఖ‌ర్ ఖ‌మ్ముల...

Mahesh Babu: అస‌లు సాయిప‌ల్ల‌వికి ఎముక‌లు ఉన్నాయా..? ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన మ‌హేష్ బాబు.
Follow us
Narender Vaitla

| Edited By: Phani CH

Updated on: Sep 26, 2021 | 7:04 AM

Mahesh Babu: నాగ చైత‌న్య, సాయి ప‌ల్ల‌వి జంట‌గా తెర‌కెక్కిన సినిమా ల‌వ్ స్టోరీ. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆశించిన స్థాయిలోనే ఆక‌ట్టుకుంటోంది. శేఖ‌ర్ ఖ‌మ్ముల తొలిసారి తెర‌కెక్కించిన ఇంటెన్సివ్ ప్రేమ క‌థ చిత్రం అంటూ ప్ర‌చారం జ‌రిగిన ఈ సినిమా అదే స్థాయిలో ఉంది. ఇక ఈ సినిమా విడుద‌ల‌కు ముందే మంచి బ‌జ్‌ను సొంతం చేసుకుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌లువురు సెల‌బ్రిటీలు సైతం సినిమాపై స్పందించ‌డంతో ఎక్క‌డ లేని ప్ర‌చారం జ‌రిగింది. ఇక విడుద‌ల త‌ర్వాత మంచి టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాపై ప‌లువురు ప్ర‌శ‌సంలు కురిపిస్తున్నారు. కొంద‌రు సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ ఫీలింగ్‌ను పంచుకుంటున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా ల‌వ్ స్టోరీ చిత్రాన్ని వీక్షించారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపిన మ‌హేష్‌.. సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించారు. సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారంటూ శేఖ‌ర్ క‌మ్ముల‌ను పొగిడిన మ‌హేష్‌.. నాగ‌చైత‌న్య ఈ సినిమాలో అద్భుత న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడ‌ని, ఇది చైత్య‌న్య కెరీర్‌ను మ‌లుపుతిప్పే సినిమా అవుతుంద‌ని కొనియాడారు.

ఇక సాయి ప‌ల్ల‌వి గురించి ప్రస్తావిస్తూ.. సాయిప‌ల్ల‌వి ఎప్పటిలాగే అద్భుతంగా న‌టించింద‌ని. అస‌లు ఈ అమ్మాయి శ‌రీరంలో ఎముక‌లు ఉన్నాయా.? అంటూ సాయి ప‌ల్ల‌విపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి చేసిన డ్యాన్స్ వెండితెర‌పై మునుపెన్న‌డూ చూడ‌లేదు. అంటూ ట్వీట్ చేశారు మ‌హేష్ బాబు.

Also Read: Pawan Kalyan: స‌న్నాసుల్లారా.. సినిమా వాళ్లకు ఊరికే డ‌బ్బులు రావట్లేదు. రిప‌బ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్‌.

Nazriya Nazim New Photos: ఎక్స్‌ప్రెష‌న్ క్వీన్ న‌జ్రియా నయా అందాలు ఓరకంట చూపులతో కవ్విస్తున్న ముద్దుగుమ్మ ఫొటోలు..

Mahesh Babu : రాజమౌళి సినిమా గురించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన సూపర్ స్టార్