Pawan Kalyan: స‌న్నాసుల్లారా.. సినిమా వాళ్లకు ఊరికే డ‌బ్బులు రావట్లేదు. రిప‌బ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్‌.

Pawan Kalyan: సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా దేవ‌క‌ట్ట ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా రిప‌బ్లిక్‌. ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 1న విడుద‌ల చేయ‌నున్నారు. సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతోన్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్...

Pawan Kalyan: స‌న్నాసుల్లారా.. సినిమా వాళ్లకు ఊరికే డ‌బ్బులు రావట్లేదు. రిప‌బ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్‌.
Follow us

|

Updated on: Sep 26, 2021 | 12:38 AM

Pawan Kalyan: సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా దేవ‌క‌ట్ట ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా రిప‌బ్లిక్‌. ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 1న విడుద‌ల చేయ‌నున్నారు. సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతోన్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా శ‌నివారం ప్రిరిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. బైక్ యాక్సిడెంట్ కార‌ణంగా తేజ్ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకాలేక‌పోయారు. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ.. సాయిధరమ్‌ తేజ్‌ ఇంకా కోమాలోనే ఉన్నారని, కళ్లు తెరవలేదని చెప్పారు. సాయితేజ్‌ ఆసుపత్రిలో ఉన్నందువల్లే తాను ఈ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు.

ఇదిలా ఉంటే ఈ సంద‌ర్భంగా మీడియా నుంచి మొద‌లు పెడితే వైసీపీ నాయ‌కుల వ‌ర‌కు అంద‌రిపై త‌న‌దైన శైలిలో చుర‌క‌లు అంటించారు ప‌వ‌ర్ స్టార్‌. ప‌వ‌న్ మాట్లాడుతూ.. సాయి ధ‌ర‌మ్ తేజ్ సినిమా ఫంక్ష‌న్స్‌కి నేను ఇంత‌కు ముందు ఎప్పుడూ రాలేదు. వాళ్లు సొంత కాళ్ల‌ మీద నిలబడాలి. నేను కూడా అలాగే ఏ సినిమా వ‌స్తే ఆ సినిమా చేస్తూ వచ్చాను. నేను ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చింది అభిమానుల‌కు కృతజ్ఞతలు చెప్ప‌డానికి. ఈ సినిమా బాగా ఆడాలి. రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ తేజ్ కోలుకోవాల‌ని చాలా మంది కోరుకున్నారు. కానీ కొంద‌రు మాత్రం ర‌క‌ర‌కాల స్టోరీలు అల్లేశారు. నేను కొన్ని స్టోరీలు చూశాను. ఇసుకతో స్కిడ్ అయిన విషయానికి కూడా ఆ యాక్సిడెంట్స్ మీద కథనాలు ఆల్లి ఏదేదో రాశారు. అలాంటివి మీకు జ‌ర‌గ‌వ‌ని గ్యారెంటీ ఉందా అని త‌న‌దైన శైలిలో స్పందించారు.

ప‌వ‌న్ ఇంకా మాట్లాడుతూ.. ఒక భగత్ సింగ్ గానీ చంద్రశేఖర్ ఆజాద్ గానీ గాంధీజీ గానీ ఎంతో మంది త్యాగాలు చేస్తే గానీ మనకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. రాజ‌కీయాల గురించి మాట్లాడుతూ.. రాను రాను రాజ‌కీయాల్లో దిగ‌జారుడు త‌నం పెరిగింద‌ని దుయ్య బ‌ట్టారు. సినిమాల్లో మాట్లాడటం ఒకటి అయితే నిజమైన జీవితంలో దానిని మాట్లాడటం చాలా కష్టమ‌న్న ప‌వ‌న్‌.. ప్ర‌తీసారి సినిమా ప‌రిశ్ర‌మ సులభంగా టార్గెట్ అవుతుంద‌న్నారు. మీడియా క‌థ‌నల‌ను హీరోల ప్ర‌మాదాల‌పై కాకుండా.. వైఎస్ వివేకానంద ఎలా హత్యకు గురయ్యారు అనే దాని మీద రాయాలని అన్నారు. తేజ్ ప్ర‌మాదం గురించి కాదు, మీరు మాట్లాడాల్సింది. కోడి కత్తి మీద, ఆరేళ్ల చిన్నారి హత్య మీద మాట్లాడాలి అంటూ కామెంట్‌ చేశారు. ఇడుపుల పాయ గురించి క‌థ‌నాలు రాయండి, కాపు రిజర్వషన్స్ గురించి, బోయ కులస్తుల గురించి రాయండి.. ఇలాంటివి రాస్తే వాళ్లు ఇంటికొచ్చి కొడ‌తారు అని అన్నారు.

ఇక చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వాళ్లు కోట్లు కోట్లుతీసుకుంటారు అని అంటుంటారు. ఓరి స‌న్నాస్సుల్లారా.. అడ్డగోలుగా గా సంపాదించడం లేదు. జనాలను ఎంటర్ టైన్ మెంట్ చేసి. ప్రభాస్ లాగా కండలు పెంచితే , ఎన్టీఆర్ డాన్సులు చేస్తే, డబ్బులు ఇస్తున్నారు. ప్ర‌తీసారి సినిమా వాళ్ల‌ను గెల‌కొద్దు, దేనినైనా తెగేదాక లాగొద్దు. ఇక వైసీపీ నాయ‌కులు సినిమా ఇండ‌స్ట్రీ వైపు చూడొద్ద‌ని తెలిపిన ప‌వ‌న్‌.. చిత్ర‌ప‌రిశ్ర‌మై క‌న్నెత్తి చూస్తే ఊరుకోను అని హెచ్చ‌రించారు. ఇలా పూర్తి స్థాయిలో ఆవేశంగా మాట్లాడిన ప‌వ‌న్ చివ‌ర‌గా సినిమా ప‌రిశ్ర‌మ‌ను ఎవ‌రూ అడ్డుకోలేరంటూ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్‍బాస్ సీజన్ 5 పై నెటిజన్స్ పెదవివిరుపు.. ఇంటిసభ్యుల తీరుపై అసహనం.. కారణమేంటంటే..

Republic Pre-Release Event: తేజ్ ఒక సైనికుడిలా ఈ సినిమాని నడిపించాడు : దేవకట్టా

Mahesh Babu : రాజమౌళి సినిమా గురించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన సూపర్ స్టార్

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!