Bigg Boss 5 Telugu: బిగ్‍బాస్ సీజన్ 5 పై నెటిజన్స్ పెదవివిరుపు.. ఇంటిసభ్యుల తీరుపై అసహనం.. కారణమేంటంటే..

బిగ్‏బాస్ .. బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో ఈ షోకు ప్రేక్షకుల నుంచి ఆదరణ ఎక్కువే. కాంట్రవర్సీలు, గొడవలు..

Bigg Boss 5 Telugu: బిగ్‍బాస్ సీజన్ 5 పై నెటిజన్స్ పెదవివిరుపు.. ఇంటిసభ్యుల తీరుపై అసహనం.. కారణమేంటంటే..
Bigg Boss 5


బిగ్‏బాస్ .. బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో ఈ షోకు ప్రేక్షకుల నుంచి ఆదరణ ఎక్కువే. కాంట్రవర్సీలు, గొడవలు.. ఆటలతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతూ.. అన్ని భాషలలో టీఆర్పీ రేటింగ్స్‏లో దూసుకుపోతుంటుంది. ఇక తెలుగులో కూడా బిగ్‏బాస్ వీక్షించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. మొదటి సీజన్ నుంచి ఈ షో విజయవంతంగా దూసుకుపోతుంది. మొదటి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్‏గా వ్యవహరించడం… అందరూ ఫేమస్ కంటెస్టెంట్స్ ఇంట్లోకి రావడంతో బుల్లితెరపై టీఆర్పీ రేటింగ్ రికార్డ్ సృష్టించింది. ఇక ఆ తర్వాత రెండవ సీజన్ న్యాచురల్ స్టార్ నాని హోస్ట్‏గా వ్యవహరించినప్పుడు.. మూడవ సీజన్ నాగార్జున వ్యవహరించినప్పుడు సైతం టీఆర్పీ రేటింగ్ లో దూసుకుపోయింది. ఇక నాలుగో సీజన్ కూడా కాస్త ఎక్కువగానే జనాలను అలరించారు. ఇక సీజన్ 5 కోసం ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేసిన సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ 5న బిగ్‏బాస్ సీజన్ 5ను హోస్ట్ నాగార్జున టన్నుల కొద్దీ ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారెంటీ అంటూ ఎంతో గ్రాండ్ గా ప్రారంభించాడు. అయితే ఈ షో మొదటి రోజే బెడిసి కొట్టింది. ఇంట్లోకి దాదాపు సగం మంది కంటెస్టెంట్స్ ఎవరో జనాలకు అస్సలు తెలియదు. కొత్త ముఖాలను తీసుకువచ్చి ప్రేక్షకులకు షాకిచ్చాడు బిగ్‏బాస్. దాదాపు 19 మంది కంటెస్టెంట్స్‏తో ప్రారంభమైన బిగ్‏బాస్ షో.. మొదటి నుంచి నత్తనడకన సాగుతోంది. మొదటి రోజే.. ఇంట్లో సభ్యులు అతి చేస్తూ.. ప్రేక్షకులకు విసుగు తెప్పించారని. అలాగే సరైన కారణం లేకుండానే అరుస్తూ.. కయ్యానికి కాలు దువ్వుతూ.. నువ్వా నేనా అంటూ రెచ్చిపోయారని నెట్టింట్లో టాక్. ఇక నామినేషన్స్ ప్రక్రియలో.. టాస్క్‏లలో అవసరానికి మించి నటిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

ఇక ఇంట్లోని సభ్యులు చేసే ఒవరాక్షన్‏తో బిగ్‏బాస్ షో చూడాలంటే విసుగువచ్చేస్తుందని నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. దీంతో వారంలోని అన్ని రోజులు టీఆర్పీ రేటింగ్ పడిపోయి.. కేవలం వీకెండ్స్ మాత్రమే టీఆర్పీ రేటింగ్ మెరుగ్గా ఉంటుందట. అంటే కేవలం వీకెండ్స్ నాగార్జున కోసం షో చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటివరకు ఇంట్లో ఉన్న సభ్యులలో ఎవరు స్ట్రాంగ్‏గా గేమ్ పై ఫోకస్ పెట్టినట్లుగా కనిపించడంలేదు. అలాగే చిన్న చిన్న కారణాలతోనే నామినేషట్ చేయడం.. ఆ సమయంలో నియంత్రణ కోల్పోయి ఆరోపణలు చేసుకోవడం ప్రేక్షకులకు నచ్చడం లేదనేది మరో వాదన. ఇవే కాకుండా.. షో టైమింగ్స్ కూడా టీఆర్పీ రేటింగ్ పై ప్రభావం చూపిస్తున్నాయట. రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు షో చూడడం చాలావరకు వీలుకావడం లేదని సోషల్ మీడియాలో టాక్. అంతేకాకుండా.. బిగ్‏బాస్ షోలో కాంట్రవర్సీలకు కేరాఫ్ గా ఉండేవారిని ఎలిమినేట్ చేసి.. షోను చప్పగా మార్చారని.. విమర్శిస్తున్నారు. బిగ్‏బాస్ షో బోరింగ్‎గా అనిపిస్తుందని.. కామెంట్స్ చేస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పాపులారిటీ ఉన్నవారిని తీసుకువస్తే.. ఆట రసవత్తరంగా మారే ఛాన్స్ ఉందంటున్నారు. మొత్తానికి బిగ్‏బాస్ సీజన్ 5 మాత్రం అసలైన వినోదాన్ని పంచడం లేదని సోషల్ మీడియాలో తగగ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Kangana Ranaut: భక్తిపారవశ్యంలో బాలీవుడ్ బ్యూటీ.. ప్రత్యేక పూజలు చేసిన కంగనా.. వైరల్ అవుతున్న ఫొటోస్…

Jacqueline Fernandez: కొత్త చిక్కుల్లో బాలీవుడ్ బ్యూటీ.. ఏకంగా 200 కోట్లు మోసం..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu