Bigg Boss 5 Telugu: ఆ ఇద్దరి మధ్యే అసలైన పోరు.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Sep 25, 2021 | 5:55 PM

బిగ్‏బాస్ సీజన్ 5 విజయవంతగా.. రెండు ఎలిమినేషన్స్ పూర్తి చేసుకుంది.. ఇక ఇప్పుడు మూడవ వారం ఎలిమినేషన్ ఎవరనేది తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Bigg Boss 5 Telugu: ఆ ఇద్దరి మధ్యే అసలైన పోరు.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..
Lahari

బిగ్‏బాస్ సీజన్ 5 విజయవంతగా.. రెండు ఎలిమినేషన్స్ పూర్తి చేసుకుంది.. ఇక ఇప్పుడు మూడవ వారం ఎలిమినేషన్ ఎవరనేది తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గడిచిన రెండు ఎలిమినేషన్స్ ప్రక్రియలో ప్రేక్షకుల అంచనా ప్రకారమే.. సరయు, ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు. కానీ మూడవ వారం ఎలిమినేషన్ మాత్రం తీవ్ర ఉత్కంఠంగా మారింది. ఈ వారం.. ప్రియాంక, శ్రీరామ్, మానస్, లహరి, ప్రియ నామినేట్ కాగా.. అందులో మానస్, శ్రీరామ్, ప్రియాంక కంటే.. అసలైన పోరు మాత్రం ప్రియ, లహరిల మధ్యే ఉంది. వీరు ముగ్గురు సేఫ్ జోన్‏లో ఉన్నట్లుగా తెలుస్తోంది. నామినేషన్ ప్రక్రియలో ప్రియ చేసిన కామెంట్స్ ఆమెపై నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చినట్లుగా టాక్. అలాగే కేవలం రవి మాటాలను మాత్రమే నమ్ముతూ.. అతడినే ఫాలో అవుతున్న లహరి పై కూడా నెటిజన్స్ అసహనంగా ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే… ఈవారం ఎలిమినేట్ అయ్యేది మాత్రం లహరినే అంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఓటింగ్ పరంగా.. అందరి కంటే తక్కువ ఓట్లు లహరికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక లహరి తర్వాత.. తక్కువ ఓట్లు ప్రియకు వచ్చాయని.. ఈవారం వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఓటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం లహరి ఈవారం ఇంటిని విడనున్నట్లుగా తెలుస్తోంది. కానీ బిగ్‏బాస్ నిర్వాహకులు.. తమ స్టాటజీ ఉపయోగించి.. టీఆర్పీ రేటింగ్ కోసం లహరిని కాకుండా.. ప్రియను ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోనవసం లేదు. ఎందుకంటే.. హౌస్‏లో పెళ్లి అయినా.. వారికంటే.. పెళ్లికానీ వారు ఉంటేనే..బిగ్‏బాస్ తన తెలివిని ఉపయోగించి టీఆర్పీ పెంచుకోగలడు. ప్రేక్షకులను దారి తప్పిస్తూ.. లవ్ ట్రాక్స్.. ట్రయాంగిల్ స్టోరీస్ అంటూ షోపై ఆసక్తిని కలిగించడంలో బిగ్‏బాస్ దిట్ట అన్న సంగతి తెలిసిందే. అందుకే గతం సీజన్లలో కూడా ప్రేక్షకుల ఓటింగ్ పరంగా కాకుండా.. ఎవరుంటే.. షోపై ఆసక్తిని కలిగించవచ్చనేది దృష్టిలో పెట్టుకుని మిగతా కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తుంటాడు.

అయితే ఈ వారం మాత్రం ప్రియ, లహరి ఇద్దరూ డేంజర్ జోన్‏లో ఉన్నారు. కానీ ఒకవేళ వీరిద్దరు షోలో ఉండాలనుకుంటే.. బిగ్‏బాస్ ప్రియాంకను ఎలిమినేట్ చేసిన సందేహం లేదు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈవారం ఎలిమినేట్ కావడానికి లహరికే ఎక్కువగా అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. అలాగే.. లహరితోపాటు.. ప్రియ కూడా ప్రమాదంలోనే ఉన్నారు. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో.. ప్రియ మాట్లాడుతూ.. రవి, లహరిలు ఇద్దరు అర్ధరాత్రి హగ్ చేసుకున్నారు… లహరి ఎక్కువగా అబ్బాయిలతోనే ఉంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇంట్లో ఉన్న మిగతా సభ్యులు సైతం ప్రియపై సీరియస్ అయ్యారు. దీంతో వరుసగా ప్రియను నామినేట్ చేస్తూ వచ్చారు. అలాగే బయట కూడా ప్రియకు నెగిటివిటి వచ్చేసింది. కానీ… రవి.. లహరి గురించి ప్రియతో మాట్లాడిన వీడియో బయటకు రావడంతో.. ఆమె సేఫ్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మాత్రం లహరి అని సోషల్ మీడియా టాక్. కానీ బిగ్‏బాస్ తన లెక్కలు, స్టాటజీ ఉపయోగించి ఆమెను సేవ్ చేసి ప్రియను ఎలిమినేట్ చేస్తాడా ? లేక ఓటింగ్ ప్రకారంగానే లహరిని ఇంటి నుంచి పంపించేస్తాడా ? అనేది చూడాలి.

Also Read: Rashmika Mandanna: లక్కీ బ్యూటీ కిట్టీలో మరో క్రేజీ ప్రాజెక్ట్.. ఆ స్టార్ హీరో సినిమాలో రష్మిక..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu