Bigg Boss 5 Telugu: ఫాంలోకి వచ్చిన బిగ్‏బాస్.. రవి బండారం బట్టబయలు.. ఆ వీడియోతో లహరికి షాకిచ్చాడుగా !!

మొదటి వారం నుంచి షో మీద ఆసక్తిగా లేనట్టుగా ప్రవర్తించాడు బిగ్‏బాస్. ఇప్పటివరకు కంటెస్టెంట్స్ ఎన్ని తప్పులు చేస్తున్నా.. పెద్దగా పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుంటూ పోయాడు.

Bigg Boss 5 Telugu: ఫాంలోకి వచ్చిన బిగ్‏బాస్.. రవి బండారం బట్టబయలు.. ఆ వీడియోతో లహరికి షాకిచ్చాడుగా !!
Bigg Boss


మొదటి వారం నుంచి షో మీద ఆసక్తిగా లేనట్టుగా ప్రవర్తించాడు బిగ్‏బాస్. ఇప్పటివరకు కంటెస్టెంట్స్ ఎన్ని తప్పులు చేస్తున్నా.. పెద్దగా పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుంటూ పోయాడు. బిగ్‏బాస్ సీజన్ 5 ప్రారంభమై.. మూడు వారాలు గడుస్తున్న ఇంటి సభ్యుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఇక నామినేషన్స్ ప్రక్రియలో మాత్రం కంటెస్టెంట్స్ రెచ్చిపోయి మరీ పర్ఫామెన్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈవారం నామినేషన్స్ ప్రక్రియ మాత్రం ఇంట్లో హీట్ పెంచేసింది. రవి.. లహరి అర్ధరాత్రి బాత్ రూం దగ్గర హగ్ చేసుకున్నారంటూ ప్రియ చేసిన వ్యాఖ్యలు ఇంట్లోనే కాదు.. ఇటు బయట కూడా సంచలనం సృష్టించాయి. అబ్బాయిలతో బిజీగా ఉంటున్నావంటూ ప్రియా మాట్లాడంతో రవి.. లహరి రెచ్చిపోయారు. అంతేకాకుండా.. ఇంట్లో మిగతా సభ్యులంతా ప్రియ మాటలకు షాకయ్యారు. వరుసగా.. ప్రియ మాటలు నచ్చలేదంటూ ఆమెను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా చూపించిన ప్రోమోతో  బిగ్‏బాస్ ఫాంలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. హోస్ట్ నాగార్జునతో ఈ వీకెండ్ కంటెస్టెంట్లను దారిలో పెట్టనున్నట్లుగా కనిపిస్తోంది.

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యాంకర్ రవి మాటల గురించి. అంతకు ముందు ప్రియతో.. లహరి యాంకరింగ్ కోసం ట్రై చేస్తుంది. నా హెల్ప్ కోసం నా వెంట పడుతుంది. పెళ్లైన వాళ్లు ఇంట్లో ఉన్నప్పటికీ ఆమె నా వెంటే పడుతుంది. ఎక్కడికి వెళ్లినా.. నా వెనకే వచ్చేస్తుంది. ఎలా చెప్పాలో తెలియడం లేదు అంటూ ప్రియకు చెప్పాడు. ఇక ఇవే మాటలను ప్రియ నామినేట్ ప్రక్రియలో అందరి ముందు బయట పెట్టి రవికి షాకిచ్చింది. ఇక ప్రియ మాటలకు లహరి, రవి ఆగ్రహంతో ఊగిపోయారు. బ్రదర్ అండ్ సిస్టర్స్ లా ఉంటున్నాము అంటూ ప్రియతో గొడవకు దిగారు. దీంతో ఇంట్లో చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఇక ఆ తర్వాత లహరి.. రవి దగ్గరకు వెళ్లి .. నేను యాంకరింగ్ కోసం ట్రై చేస్తున్నా అని.. అందుకే మీతో ఉంటున్నా.. సింగిల్ మెన్ అని అన్నారా ? అని ప్రశ్నించగా.. తను ఆ మాటలు అనలేదని.. ప్రియ కావాలనే తనను బ్యాడ్ చేస్తుందని చెప్పుకొచ్చాడు.

అయితే రవి.. ప్రియతో లహరి గురించి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. రవిని ఏకిపారేసారు నెటిజన్లు.. ఇద్దరితో డబుల్ గేమ్ ఆడుతున్నాడంటూ ట్రోల్ చేశారు. ఇక రవి, లహరి, ప్రియల మధ్య జరిగిన ఇష్యూతో నాగార్జున కూడా ఫుల్ ఫైర్‏లో ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున.. వీరి ముగ్గురికి క్లాస్ తీసుకుంటూ కనిపించాడు. అందులో ముందు ప్రియను హగ్ చేసుకోవడం అంటే బిజీగా ఉన్నట్టా ? అది తప్పా ? అంటూ అడిగేశారు. ఆ తర్వాత రవి, ప్రియ నేమ్ ప్లేట్‏ను సుత్తితో ముక్కలు చేశాడు. ఇక ఆతర్వాత.. రవిని.. నువ్వు ప్రియతో సింగిల్ మెన్ అనే మాట అన్నావా ? అని ప్రశ్నించగా.. అన్నాను సర్ అంటూ ఒప్పుకున్నాడు. ప్రియ ఒప్పుకున్నాడా ? అని అడగ్గా.. ఇప్పటివరకు ఒప్పుకోలేదు అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత లహరిని పవర్ రూంకు పంపి.. రవి, ప్రియ ఇద్దరూ మాట్లాడుకున్న వీడియోను చూపించి లహరికి షాకిచ్చాడు బిగ్‏బాస్. నీకు క్లారిటీ వచ్చింది కదా.. తప్పు ఎవరు చేశారో. బయటకు వెళ్లాక.. తప్పు లేనివాళ్లను హగ్ చేసుకోవాలని చెప్పాడు. మరి బయటకు వెళ్లిన లహరి.. రవికి సపోర్ట్ చేస్తుందా ? లేదా ప్రియకు సపోర్ట్ చేస్తుందా ? అనేది చూడాలి.

ప్రోమో..

Also Read: Nagarjuna Vs Pawan Kalyan: బంగార్రాజు వర్సెస్ పవర్ స్టార్‌… బిగ్ బాస్‌ని కొట్టడానికి ఇదో బిగ్ ఛాన్స్..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu