Nagarjuna Vs Pawan Kalyan: బంగార్రాజు వర్సెస్ పవర్ స్టార్‌… బిగ్ బాస్‌ని కొట్టడానికి ఇదో బిగ్ ఛాన్స్..

తెలుగు బుల్లితెర ఆడియన్స్‌ని మచ్చిక చేసుకుని, బుట్టలో వేసుకుని టీఆర్‌పీ రేసులో ముందు నిలబడాలన్న తాపత్రయం.. టీవీ ఛానెళ్ల మధ్య మంచి కాంపిటిటివ్ స్పిరిట్‌ని నింపుతోంది.

Nagarjuna Vs Pawan Kalyan: బంగార్రాజు వర్సెస్ పవర్ స్టార్‌... బిగ్ బాస్‌ని కొట్టడానికి ఇదో బిగ్ ఛాన్స్..
Akkineni Nagarjuna, Pawan Kalyan
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 25, 2021 | 4:17 PM

తెలుగు బుల్లితెర ఆడియన్స్‌ని మచ్చిక చేసుకుని, బుట్టలో వేసుకుని టీఆర్‌పీ రేసులో ముందు నిలబడాలన్న తాపత్రయం.. టీవీ ఛానెళ్ల మధ్య మంచి కాంపిటిటివ్ స్పిరిట్‌ని నింపుతోంది. గతంలో స్టార్‌ మా దగ్గరున్న KBC కాన్పెప్ట్‌ని కొద్దిగా స్పెల్లింగ్ మార్చి.. జెమినీ టీవీ టేకోవర్ చేసింది. ఆ వెంటనే బిగ్‌ బాస్ ఫిఫ్త్ సీజన్‌ని హడావిడిగా మొదలుపెట్టి ఎలర్ట్ అయింది స్టార్‌ మా. మరి… జీ తెలుగు సిట్యువేషన్ ఏంటి?

సీరియల్స్‌ విషయంలో కాస్త పుంజుకున్నా ఒరిజినల్ కంటెంట్‌ని డెవలప్‌ చేయడంలో వెనకబడ్డ జీ తెలుగు.. క్రేజీ అండ్ పాపులర్‌ కాన్సెప్ట్‌ కోసం ఇంకా సెర్చింగ్‌లోనే వుంది. ఆడియన్స్‌తో కనెక్టివిటీని ఇంటాక్ట్‌గా వుంచుకోవడం కోసం అక్కడ మేథోమథనం జరుగుతూనే వుంది. ప్రస్తుతానికి.. స్టార్‌ మా, జెమినీ దూకుడును ఎంతో కొంత నియంత్రించడం మీద ఫోకస్ పెట్టింది జీ తెలుగు.

వీకెండ్‌ ప్రైమ్‌ టైమ్స్‌ని దాదాపుగా కబ్జా చేసిన బిగ్‌ బాస్‌ని నిలువరించడానికి జీ తెలుగుకి ఒక ఛాన్స్ దొరికింది. ఇవాళ సాయంత్రం జరిగే రిపబ్లిక్ మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్‌ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు రెండురోజుల నుంచి జీ తెలుగులో క్యాంపెయిన్ జరుగుతోంది. పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్ చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యే ఈ వేడుక మీద సహజంగానే అన్ని సెక్షన్స్‌ నుంచి క్యూరియాసిటీ వుంటుంది. ఆ విధంగా ఈ వీకెండ్‌లోనైనా టెలివిజన్ ఆడియన్స్‌ని తమవైపు తిప్పుకునేలా ప్లాన్ చేశారు జీ తెలుగు నిర్వాహకులు.

సో… నాగార్జున హోస్ట్ చేసే బిగ్‌బాస్‌ షో మీద ఆడియన్స్‌ ఫోకస్‌ని ఆ కొద్దిసేపైనా కంట్రోల్‌ చేసే అవకాశం దక్కింది. రిపబ్లిక్ మూవీ నిర్మాతలు కూడా జీ స్టూడియోసే కనుక.. లైవ్ టెలికాస్ట్‌ ఛాన్స్‌ని.. ఇలా ఉపయోగించుకుంటున్నారు. సో… ఈ శనివారం ప్రైమ్‌టైమ్‌ టీఆర్‌పీల రేస్… నాగ్ వర్సెస్ పవర్‌స్టార్ అనే రేంజ్‌లో… రంజుగా వుండబోతోందన్నమాట.

రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్‌ను ఇక్కడ వాచ్ చేయండి..

(శ్రీహరి రాజా, టీవీ9 తెలుగు, ET డెస్క్)

Also Read..

Khiladi Movie: రూమర్స్‏కు చెక్ పెట్టిన ఖిలాడి చిత్రయూనిట్.. రవితేజ సినిమా గురించి ఏమన్నారంటే..

టాలీవుడ్‌లో కొత్త అందాలు.. క్యూట్‌నెస్‌తో కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న ముద్దుగుమ్మలు..