టాలీవుడ్‌లో కొత్త అందాలు.. క్యూట్‌నెస్‌తో కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న ముద్దుగుమ్మలు..

టాలీవుడ్‌ను కొత్త అందాలు పలకరిస్తున్నాయి. కొంతమంది అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటే కొంత మంది మాత్రం మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు.

టాలీవుడ్‌లో కొత్త అందాలు.. క్యూట్‌నెస్‌తో కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న ముద్దుగుమ్మలు..
Sreeleela


టాలీవుడ్‌ను కొత్త అందాలు పలకరిస్తున్నాయి. కొంతమంది అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటే కొంత మంది మాత్రం మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు.. అంతే కాదు రాత్రికి రాత్రే క్రేజీ హీరోయిన్స్‌గా మారిపోతున్నారు. ఆలా వచ్చిన ముద్దుగుమ్మలో రీసెంట్ సెన్సేషన్ కృతి శెట్టి ఒకరు. ఈ అమ్మడు ఉప్పెన సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిపోయింది కృతి. సుకుమార్ ప్రియా శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వలో వచ్చిన ఉప్పెన సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో కృతి క్యూట్‌నెస్‌కు నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారనే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత కృతి కిట్టీలో చాలా సినిమాలు వచ్చి చేరాయి. ప్రస్తుతం ఈ చిన్నది నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తుంది. అలాగే.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న బైలింగ్వల్ మూవీలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది కృతి. సుదీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఆ అమ్మాయిగురించి మీకు చెప్పాలి సినిమాలో కూడా కృతిని హీరోయిన్‌గా చేస్తుంది. వీటితో పాటు అక్కినేని నాగార్జున నటిస్తున్న బంగార్రాజు సినిమాలో చైతన్యకు జోడిగా చేస్తుంది. ఇటీవలే నితిన్ నటిస్తున్న సినిమాలోనూ కృతి హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది. నితిన్ చేస్తున్న మాచర్ల నియోజక వర్గం సినిమాలో నటిస్తుంది కృతి.

ఇప్పుడు ఈ  అమ్మడిలానే మరో ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పెళ్లిసందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కన్నడ బ్యూటీ శ్రీలీల పరిచయం అవ్వబోతుంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న పెళ్లిసందDలో శ్రీలీలా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పయికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వీటిల్ శ్రీలీలను చూసిన ప్రేక్షకులు మనసు పారేసుకుంటున్నారు. అందం అల్లరి కలబోసినా ఈ ముద్దుగుమ్మ యువతను ఆకర్షిస్తుంది. ఇక యంగ్ హీరోలంతా తమ రాబోయే సినిమాల్లో ఈ అమ్మడిని ఎంపిక చేయాలని చూస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే పలు ఆఫర్లు శ్రీలీల ముందు క్యూ కట్టాయని తెలుస్తుంది. అందులో రవితేజ సినిమా కూడా ఉందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ చిన్నది కూడా కృతిశెట్టి లా క్రేజ్ తెచుకుంటుందని విశ్లేషకులు  చెప్తున్నారు. మరి ఈ ముద్దుగుమ్మలు ఇద్దరు తెలుగులో ఏ స్థాయిలో రాణిస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sankranti 2022 – Movies: సంక్రాంతి బరిలో నిలిచి.. బాక్సాఫీస్ వద్ద వార్‌కు సై అంటున్న స్టార్ హీరోలు..

Parineeti Chopra: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ అందాలను వలకపోస్తున్న పరిణితీ చోప్రా లేటెస్ట్ ఫొటోస్..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu