Akash Puri’s Romantic: రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన ఆకాష్ పూరి.. రొమాంటిక్ మూవీ వచ్చేది ఎప్పుడంటే..

డైనమిక్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పూరిజగన్నాథ్. మిగిలిన దర్శకులతో పోల్చుకుంటే పూరీ సినిమాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి.

Akash Puri's Romantic: రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన ఆకాష్ పూరి.. రొమాంటిక్ మూవీ వచ్చేది ఎప్పుడంటే..
Romantic
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 25, 2021 | 2:59 PM

Akash Puri’s Romantic: డైనమిక్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పూరిజగన్నాథ్. మిగిలిన దర్శకులతో పోల్చుకుంటే పూరి సినిమాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. తన సినిమాల్లో నిజాలను పచ్చిగా చెప్పేస్తాడు పూరి అందుకే ఆయన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇక పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో నటించి మెప్పించిన ఆకాష్. ఇటీవల హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. ఆకాష్ నటించిన మెహబూబా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో అలరించడానికి సిద్ధం అయ్యాడు ఆకాష్. ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం రొమాంటిక్. ఈ సినిమాకు పూరి శిష్యుడు అనిల్ పాదూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ పూరిజగన్నాథ్ అందించారు. ఇక ఆకాశ్ సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయినా ఈ సినిమా పోస్టర్లు, రెండు పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే గతంలో ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల కానుందని టాక్ వినిపించింది. అంతే కాదు ఓటీటీ నుంచి భారీ ఆఫర్లు వచ్చినప్పటికీ ఈ సినిమా థియేటర్స్‌లోనే విడుదల చేయాలని చిత్రయూనిట్ ఇన్ని రోజులు ఆగారు. మొత్తానికి దీపావళి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై ‘రొమాంటిక్’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sankranti 2022 – Movies: సంక్రాంతి బరిలో నిలిచి.. బాక్సాఫీస్ వద్ద వార్‌కు సై అంటున్న స్టార్ హీరోలు..

Parineeti Chopra: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ అందాలను వలకపోస్తున్న పరిణితీ చోప్రా లేటెస్ట్ ఫొటోస్..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి కొత్తగా వచ్చిన అతిథి.. ఎవరో తెలుసా?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే