Sankranti 2022 – Movies: సంక్రాంతి బరిలో నిలిచి.. బాక్సాఫీస్ వద్ద వార్‌కు సై అంటున్న స్టార్ హీరోలు..

Sankranti 2022-Movies: సంక్రాంతి పండగ అంటే కొత్త అల్లుళ్ళు, కోడి పందాలు, ముగ్గులు గొబ్బెమ్మలు పిండివంటలే కాదు.. సినిమాలు కూడా. సంక్రాంతి పండగ వచ్చిందంటే కొత్త సినిమా రిలీజ్ కోసం..

Sankranti 2022 - Movies: సంక్రాంతి బరిలో నిలిచి.. బాక్సాఫీస్ వద్ద వార్‌కు సై అంటున్న స్టార్ హీరోలు..
Pongal Movies
Follow us
Surya Kala

|

Updated on: Sep 25, 2021 | 4:12 PM

Sankranti 2022 – Telugu Movies: సంక్రాంతి పండగ అంటే కొత్త అల్లుళ్ళు, కోడి పందాలు, ముగ్గులు గొబ్బెమ్మలు పిండివంటలే కాదు.. సినిమాలు కూడా. సంక్రాంతి పండగ వచ్చిందంటే కొత్త సినిమా రిలీజ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు.  తమ సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షంతో రికార్డ్స్ సృష్టించాలని ప్రతి హీరో కోరుకుంటాడు. అందుకు తగిన విధంగానే తెలుగు సినిమా పరిశ్రమలో సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదలవుతుంటాయి. మూడు రోజుల పండగ  సమయంలో రిలీజైన సినిమాలకు మంచి టాక్ వస్తే.. ఓ రేంజ్ లో కలెక్షన్లను రాబడతాయి.  అందుకనే ఎక్కువగా చిత్ర నిర్మాతలు సంక్రాంతి బరిలో తమ సినిమాలను నిలపడానికి ఇష్టపడతారు. ఈ సమయంలో పెద్ద సినిమాలు విడుదల చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు.  కరోనా సృష్టించిన కల్లోలం తర్వాత  ఇప్పుడిప్పుడే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. అయితే 2020 సంక్రాంతి బరిలో నిలిచే పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ ను ప్రకటించి.. బాక్సాఫీస్ వద్ద వార్ ను డిసైడ్ చేశాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆచార్య సినిమాతో సంక్రాంతి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇంకా చిత్ర యూనిట్ అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది

సినిమాలకు పెద్ద సీజన్ అయిన సంక్రాంతికి ధియేటర్లో సినిమాల దండయాత్ర జరగబోతోంది. 2022 సంక్రాంతి బరిలో నిలిచి..అసలు ఏ మాత్రం తగ్గేదే లేదంటున్నారు హీరోలు.  సంక్రాంతికి ఇప్పటికి అఫీషియల్ గా  ఐదు సినిమాలు తమ రిలీజ్ డేట్ ను ప్రకటించాయి.  ఇప్పటి వరకూ ప్రకటించిన డేట్స్ ప్రకారం.. టాలీవుడ్ లో సంక్రాంతి బజ్ ను షురూ చేస్తుంది పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ సినిమాతోనే ..

పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతున్న “భీమ్లానాయక్” తో పండగ సందడిని మొదలు పెట్టనున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక మేము ఉన్నామంటూ ఫన్, ఫ్రస్టేషన్ తో వెంకటేష్-వరుణ్ తేజ్ లు రానుండగా.. రాధే శ్యామ్ అంటూ ప్రభాస్ పోటీకి సై అంటున్నాడు.

ముందుగా  జనవరి 12న పవన్ కళ్యాణ్  భీమ్లానాయక్ సినిమాతో సంక్రాంతి సందడి చేయనున్నారు. ఇక జనవరి 12న మహేష్ బాబు సర్కారువారి పాటతో రానున్నాడు. పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ తో జనవరి 14న ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాడు. ఇదే రోజున వెంకటేష్ వరుణ్ తేజ్ లు మరోసారి నవ్వించడానికి ఎఫ్ 3 తో రెడీ అవుతున్నారు. ఓ వైపు తెలుగు సినిమాలకు థియేటర్స్ కొరత లేకుండా చూసుకోవాలి అనుకుంటున్న సమయంలో కోలీవుడ్ స్టార్ హీరో తెలుగబ్బాయి అజిత్ కూడా వాలిమై సినిమాతో సంక్రాంతికి సందడి చేయడానికి సై అంటున్నాడు. దీంతో బాక్సాఫీస్ వద్ద వార్ కు కలెక్షన్ల వర్షానికి సినిమాలు రెడీ ఐన నేపథ్యంలో ప్రేక్షకులు కూడా పండగను కొత్త సినిమాలతో జరుపుకోవడానికి రెడీ అవుతున్నాడు.

Also Read:  దారిన పోతున్న ఆవు దగ్గర పాలకు వెళ్లిన పంది.. ఆగిమరీ పాలు ఇచ్చిన గోమాత.. వీడియో వైరల్

K.Viswanath-Ram Charan: ఒకే ఫేమ్‌లో కనువిందు చేస్తున్న కళాతపస్వి కే. విశ్వనాథ్.. మెగా హీరో రామ్ చరణ్..

SP Balu: మీ అమృత గానానికి మరణం లేదు.. వర్థంతినాడు ఎస్పీ బాలును స్మరించుకుంటున్న నెటిజన్స్..