AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆవు దగ్గరకు పాల కోసం వెళ్లిన పంది.. ఆగి మరీ పాలు ఇచ్చిన గోమాత.. వీడియో వైరల్

Viral Video: కడపజిల్లా ప్రొద్దుటూరు శ్రీనివాసనగర్ లో ఒక వింత జరిగింది.పెద్దగుంత వద్ద దారినిపోతున్న ఆవు వద్దకు వెళ్లి ఒక పంది వెళ్లి పాలు తాగింది. రోడ్డుపక్కన ఆవులు సంచరిస్తుండగా..

Viral Video: ఆవు దగ్గరకు పాల కోసం వెళ్లిన పంది.. ఆగి మరీ పాలు ఇచ్చిన గోమాత.. వీడియో వైరల్
Cow Milk
Surya Kala
| Edited By: |

Updated on: Sep 25, 2021 | 1:35 PM

Share

Viral Video: కడపజిల్లా ప్రొద్దుటూరు శ్రీనివాసనగర్ లో ఒక వింత జరిగింది.పెద్దగుంత వద్ద దారినిపోతున్న ఆవు వద్దకు వెళ్లి ఒక పంది వెళ్లి పాలు తాగింది. రోడ్డుపక్కన ఆవులు సంచరిస్తుండగా అటుగా వచ్చిన ఓ పంది ఆవు పొదుగును చూసి పాలను తాగింది. పాల కోసం వచ్చిన పందిని చూసిన ఆవు.. నిలబడి మరీ పంది పాలు తాగేటంత వరకూ ఉంది.  సర్వ సాధారణంగా ఇతర జంతువుల వద్దకు ఆవులు పెద్దగా చేరవు. అయితే ఆకలి ఎవరిదైనా ఒకటే అన్నట్లుగా ఆవు .. పందికి పాలు ఇచ్చి మాతృత్వాన్ని చాటుకుంది. పాలను తాగేందుకు వచ్చిన పందిని చూసి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తన పాలను పందికి పట్టింది. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అక్కడే ఉన్న స్థానికుడు రాజేష్ తన మొబైల్ ఫోన్ లో ఈ సంఘటనను చిత్రీకరించాడు.

స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ వింతలు చోటు చేసుకున్నా వెంటనే అందరికి తెలుస్తున్నాయి. వాటిల్లో కొన్ని మనిషి ఆలోచింపజేసేవిగా ఉంటే మరికొన్ని సంతోషాన్ని కలిగించేవిగా ఉంటాయి. ఇంకొన్ని.. మానవత్వం అంటే ఇదేనేమో అనిపిస్తాయి. ఇక  ముఖ్యంగా జంతువులు చేసే పనులు.. చూపే తెలివితేటలు వంటి వీడియోలు ఐతే ఓ రేంజ్ లో నెట్టింట్లో హల్ చల్ చేస్తునే ఉన్నాయి.  ముఖ్యంగా కొన్ని వీడియో ల్లో జాతి వైరం మరచి జంతువులు చూపించే ప్రేమ ఐతే నెటిజన్లను మరింత ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఆవు దగ్గర పాలు తాగుతున్న పంది వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Also Read: Jowar Vegetable Biryani: జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలు బెస్ట్, జొన్న బిర్యాని తయారీ ఎలా అంటే

K.Viswanath-Ram Charan: ఒకే ఫేమ్‌లో కనువిందు చేస్తున్న కళాతపస్వి కే. విశ్వనాథ్.. మెగా హీరో రామ్ చరణ్..