Salaar Movie: ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్.. సలార్ సినిమాపై డైరెక్టర్ స్పెషల్ ఫోకస్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో సలార్ ఒకటి. కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ సలార్ మూవీ తెరకెక్కిస్తున్నాడు.

Salaar Movie: ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్.. సలార్ సినిమాపై డైరెక్టర్ స్పెషల్ ఫోకస్..
Salaar
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 25, 2021 | 2:58 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో సలార్ ఒకటి. కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ సలార్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సెన్సెషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో స్టార్ క్యాస్టింగ్, అత్యన్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

సలార్ సినిమా కోసం ఇండియాలోనే ఇంతకు ముందెన్నడు లేని హై ఎండ్ హాలీవుడ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మ్యాట్రిక్స్, బ్యాట్ మ్యాన్ వంటి హాలీవుడ్ చిత్రాలకు ఉపయోగించిన టెక్నాలజీతో సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా సమాచారం. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేసిన ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్.. సినిమాలో మరింత హైలేట్ కానుందట. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి పోస్టర్స్ కు భారీ స్పందన లభించింది.

అత్యంత భారీ బడ్జెట్‏తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. 2022 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ మూవీతోపాటు.. ప్రభాస్.. ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సైన్స్ ఫిక్సన్ మూవీ చేస్తున్నాడు. ఇక ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read: Sankranti 2022-Movies: సంక్రాంతి బరిలో నిలిచి.. బాక్సాఫీస్ వద్ద వార్‌కు సై అంటున్న స్టార్ హీరోలు..

Parineeti Chopra: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ అందాలను వలకపోస్తున్న పరిణితీ చోప్రా లేటెస్ట్ ఫొటోస్..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి కొత్తగా వచ్చిన అతిథి.. ఎవరో తెలుసా?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే