AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khiladi Movie: రూమర్స్‏కు చెక్ పెట్టిన ఖిలాడి చిత్రయూనిట్.. రవితేజ సినిమా గురించి ఏమన్నారంటే..

ప్రస్తుతం మాస్ మాహారాజా రవితేజ పుల్ జోష్ మీదున్నాడు. చాలా కాలం తర్వాత క్రాక్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు రవితేజ. కరోనా మొదటి లాక్ డౌన్ అనంతరం విడుదలైన

Khiladi Movie: రూమర్స్‏కు చెక్ పెట్టిన ఖిలాడి చిత్రయూనిట్.. రవితేజ సినిమా గురించి ఏమన్నారంటే..
Raviteja
Rajitha Chanti
|

Updated on: Sep 25, 2021 | 3:40 PM

Share

ప్రస్తుతం మాస్ మాహారాజా రవితేజ పుల్ జోష్ మీదున్నాడు. చాలా కాలం తర్వాత క్రాక్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు రవితేజ. కరోనా మొదటి లాక్ డౌన్ అనంతరం విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. ఇక ఈ మూవీతో మళ్లీ ఫాంలోకి వచ్చిన రవితేజ.. వరుస ప్రాజెక్ట్స్ పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తుండగా.. హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

రవితేజ కెరీర్‏లోనే అత్యంత భారీ బడ్జెట్‏తో రూపొందుతున్న ఈ సినిమా గురించి ఇటీవల గత కొద్ది రోజులుగా వరుస కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాకు ఫైనాన్సియల్ ఇబ్బందులు వచ్చాయని.. ఆ కారణంతో సినిమా షూటింగ్ ఆగిపోయిందని టాక్ వినిపించింది. అయితే ఆ వార్తలపై చిత్రయూనిట్ గానీ.. డైరెక్టర్ గానీ.. రవితేజ గానీ ఎవ్వురు స్పందించలేదు. తాజాగా ఖిలాడి టీం.. రూమర్స్ గురించి స్పందిస్తూ.. సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తిగా కంప్లీట్ అయ్యిందని.. కేవలం రెండు పాటలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని తెలిపింది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లుగా టాక్.

Also Read: టాలీవుడ్‌లో కొత్త అందాలు.. క్యూట్‌నెస్‌తో కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న ముద్దుగుమ్మలు..

RGV: కొండా దంపతుల బయోపిక్ వివాదం కానుందా? వర్మ మూవీపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

Akash Puri’s Romantic: రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన ఆకాష్ పూరి.. రొమాంటిక్ మూవీ వచ్చేది ఎప్పుడంటే..

Salaar Movie: ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్.. సలార్ సినిమాపై డైరెక్టర్ స్పెషల్ ఫోకస్..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..