Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV: కొండా దంపతుల బయోపిక్ వివాదం కానుందా? వర్మ మూవీపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

రాంగోపాల్‌వర్మ .. ఏది చేసినా సంచలనమే.. వెండితెరపై సినిమా తీసినా, ఓటీటీలో వెబ్‌సిరీస్‌ రూపొందించినా వర్మ స్టయిలే వేరు.

RGV: కొండా దంపతుల బయోపిక్ వివాదం కానుందా? వర్మ మూవీపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
Rgv's Konda Couple Biopic
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 25, 2021 | 3:07 PM

రాంగోపాల్‌వర్మ .. ఏది చేసినా సంచలనమే.. వెండితెరపై సినిమా తీసినా, ఓటీటీలో వెబ్‌సిరీస్‌ రూపొందించినా వర్మ స్టయిలే వేరు. ఇక బయోపిక్‌ చిత్రాల నిర్మాణంలో రాంగోపాల్‌వర్మ టేకింగ్‌ గురించి చెప్పాల్సిన పని లేదు. రాయలసీమ ఫ్యాక్షనిజం మీద వర్మ తీసిన రక్తచరిత్ర సినిమా ఎన్ని సంచనాలు సృష్టించిందో తెలిసిందే.. ఇప్పుడు వర్మ ఫోకస్‌ తెలంగాణపై పడింది. తెలంగాణలో అతి ముఖ్యమైన సందర్భం సాయుధ పోరాటం.. ఈ అంశంపై త్వరలో వర్మ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ నేతలు కొండా మురళీ, కొండా సురేఖల బయోపిక్‌ని రూపొందించే పనిలో ఉన్నారు.

సున్నితమైన అంశాలను తెరకెక్కించడంలో రాంగోపాల్‌వర్మ దిట్ట. రాయలసీమ ఫ్యానిజమైనా, ఎన్టీఆర్‌ బయోపిక్‌ అయినా, విజయవాడ రౌడీయిజం అయినా ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా తెరకెక్కించడం వర్మ స్టయిల్‌. అయితే వర్మ సినిమాలు చాలా వరకు వివాదాస్పదమవుతుంటాయి. బోల్డ్‌ కంటెంట్‌తో ముందుకు వెళ్లడమే దీనికి కారణం. ఇప్పుడు తెలంగాణ సాయుధపోరాటం, వరంగల్‌ రాజకీయాలను టచ్‌ చేసే అవకాశం ఉండటంతో ఈ మూవీ ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి..

కొండా మురళీ, కొండా సురేఖ బయోపిక్‌ నిర్మాణం కోసం ఇటీవల రాంగోపాల్‌వర్మ వరంగల్‌ వెళ్లాడు. లాల్‌బహదూర్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ను కలిశాడు. దీంతో ఈ బయోపిక్‌ వార్తలకు మరింత బలం చేకూరింది. కాలేజీలో కొండా మురళీ దంపతులపై వర్మ ఎంక్వైరీ చేశాడు. ఈ కాలేజీలోనే వీరిద్దరు చదువుకోవడంతో అప్పటి వివరాలను ఆరా తీశాడు. దీంతో ఈ బయోపిక్‌ కన్ఫార్మ్‌ అని తేలిపోయింది. వర్మ రిలీజ్‌ చేసిన ఆడియో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. వరంగల్‌ ఎల్‌బి కాలేజీ ప్రిన్సిపాల్‌ కూడా ఈ విషయాన్ని నిర్థారించారు. కొండా మురళీ దంపతుల గురించి వివరాలు అడిగారని, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా కాలేజీలో షూటింగ్‌ జరుపుకునేందుకు అనుమతి కోరారని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

Rgv

Rgv

అయితే కొండా మురళీ దంపతుల బయోపిక్‌లో ఏయే అంశాలను టచ్‌ చేస్తారనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ఆడియోలో తెలంగాణ సాయుధ పోరాటం గురించి వర్మ ప్రస్తావించారు. అంతేకాదు మావోయిస్టు నేత ఆర్‌కె పేరును ప్రస్తావించారు. దీంతో అటు తెలంగాణ సాయుధ పోరాటం, మావోయిస్టు ఉద్యమం, వరంగల్‌ రాజకీయాల గురించి కూడా ఈ బయోపిక్‌లో టచ్‌ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యమం అనేది ఎప్పుడూ ఆగదు.. అది దాని రూపు మార్చుకుంటుంది అంతే అంటూ వర్మ చెప్పిన డైలాగ్‌తో కొండా దంపతుల బయోపిక్‌.. తెలంగాణలో వివాదానికి దారి తీసే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్‌ జరుపుకోబోతున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే అటు సాధారణ ప్రేక్షకులతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ మొదలైంది.

Also Read..

Salaar Movie: ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్.. సలార్ సినిమాపై డైరెక్టర్ స్పెషల్ ఫోకస్..

Sankranti 2022 – Movies: సంక్రాంతి బరిలో నిలిచి.. బాక్సాఫీస్ వద్ద వార్‌కు సై అంటున్న స్టార్ హీరోలు..