Rashmika Mandanna: లక్కీ బ్యూటీ కిట్టీలో మరో క్రేజీ ప్రాజెక్ట్.. ఆ స్టార్ హీరో సినిమాలో రష్మిక..

ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందన్న ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది.

Rashmika Mandanna: లక్కీ బ్యూటీ కిట్టీలో మరో క్రేజీ ప్రాజెక్ట్.. ఆ స్టార్ హీరో సినిమాలో రష్మిక..
Rashmika
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 25, 2021 | 5:35 PM

Rashmika Mandanna: ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందన్న ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ రేస్‌లో చేరిన రష్మిక వరుసగా భారీ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఒక్కసారిగా ఈ అమ్మడు స్టార్ హీరోలకు బెస్ట్ ఛాయిస్‌గా మారిపోయింది. ప్రస్తుతం రష్మిక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక తెలుగు సినిమాలతోపాటు కన్నడ, తమిళ సినిమాల్లోనూ నటిస్తుంది రష్మిక.. ఇటీవలే తమిళ్‌‌లో స్టార్ హీరో కార్తీ నటించిన సుల్తాన్ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. అలాగే ఇటీవల బాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.. అమితాబ్ నటిస్తున్న ఓ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది మలయాళం లోను నటించడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది.

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఓ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా ఎంపిక అయ్యిందని తెలుస్తుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఓ సినిమా చేస్తున్నాడు. స్వప్న సినిమా – వైజయంతీ మూవీస్ ఈ  సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కొంతకాలం క్రితం రష్మికను సంప్రదించగా, రీసెంట్ గా ఓకే చెప్పిందని తెలుస్తుంది. ఈ సినిమా తెలుగులో తెరకెక్కినప్పటికీ మలయాళంలోనూ రిలీజ్ అవ్వనుంది. సో రష్మిక ఈ సినిమాతో మలయాళంలోనూ అడుగుపెట్టనుందన్నమాట..  యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమారాబోతుంది. మరో ప్రధానమైన పాత్రలో మృణాల్ ఠాకూర్ కనిపించనుందట.. ఈ విషయం పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sankranti 2022 – Movies: సంక్రాంతి బరిలో నిలిచి.. బాక్సాఫీస్ వద్ద వార్‌కు సై అంటున్న స్టార్ హీరోలు..

Parineeti Chopra: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ అందాలను వలకపోస్తున్న పరిణితీ చోప్రా లేటెస్ట్ ఫొటోస్..

Mahesh Babu: మహేష్ వాడిన మొదటి మొబైల్ ఏంటో తెలుసా.. ఆసక్తికర విషయం చెప్పిన సూపర్ స్టార్..

Khiladi Movie: రూమర్స్‏కు చెక్ పెట్టిన ఖిలాడి చిత్రయూనిట్.. రవితేజ సినిమా గురించి ఏమన్నారంటే..

విదేశీ పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్‌రెడ్డి.. లక్ష్యం ఒక్కటే!
విదేశీ పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్‌రెడ్డి.. లక్ష్యం ఒక్కటే!
డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్‌కు ఊరట.. హైకోర్టు క్లీన్ చీట్
డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్‌కు ఊరట.. హైకోర్టు క్లీన్ చీట్
మాంసంపై నిమ్మకాయ రసం ఆరోగ్యకరమేనా ?
మాంసంపై నిమ్మకాయ రసం ఆరోగ్యకరమేనా ?
ప్రయాగరాజ్‌కు చేరుకున్న విదేశీయులు భజనలతో సందడి చేస్తోన్న భక్తులు
ప్రయాగరాజ్‌కు చేరుకున్న విదేశీయులు భజనలతో సందడి చేస్తోన్న భక్తులు
హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌..!
హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌..!
పరికిణిలో చందమామ ఈ కోమలిలానే ఉంటుందేమో.. మెస్మరైజ్ పాయల్..
పరికిణిలో చందమామ ఈ కోమలిలానే ఉంటుందేమో.. మెస్మరైజ్ పాయల్..
త్వరలో తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం
త్వరలో తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం
రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరిన రూపాయి..!
రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరిన రూపాయి..!
జాబిల్లికి వెన్నెలను అప్పు ఇవ్వగలదు ఈ వయ్యారి.. స్టన్నింగ్ ప్రగ్య
జాబిల్లికి వెన్నెలను అప్పు ఇవ్వగలదు ఈ వయ్యారి.. స్టన్నింగ్ ప్రగ్య
స్మార్ట్‌ఫోన్ అలవాటుతో ఆరోగ్యానికి ముప్పు ?
స్మార్ట్‌ఫోన్ అలవాటుతో ఆరోగ్యానికి ముప్పు ?