Mahesh Babu: మహేష్ వాడిన మొదటి మొబైల్ ఏంటో తెలుసా.. ఆసక్తికర విషయం చెప్పిన సూపర్ స్టార్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ  పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే..

Mahesh Babu: మహేష్ వాడిన మొదటి మొబైల్ ఏంటో తెలుసా.. ఆసక్తికర విషయం చెప్పిన సూపర్ స్టార్..
Mahesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 25, 2021 | 4:06 PM

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ  పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే.. తెరపై మహేష్ కనిపిస్తే చాలు.. పూనకాలే.. అంతలా అశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు మహేష్. నటశేఖర కృష్ణ వారసుడిగా వచ్చినా తనదైన టాలెంట్‌తోనే మహేష్ సూపర్ స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం మహేష్ టాలీవుడ్ టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. ఇక మహేష్ సినిమాలతోనే కాదు పలు వాణిజా సమస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గాను వ్యవహరిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు ఖాతాలోకి ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ బిగ్ సి కూడా చేరింది. తాజాగా దీనికి సంబంధించిన సూపర్ స్టార్ మహేష్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మహేష్ ఫన్నీగా సమాధానాలు చెప్పారు.

మీడియాతో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు మహేష్. ఈ సందర్భంగా తన మొదటి మొబైల్ గురించి అడిగిన ప్రశ్నకు మహేష్ సమాధానం చెప్పారు. మీరు వాడిన మొదటి మొబైల్ ఏంటి అని ప్రశ్నించగా.. దానికి నేను వాడిన మొదటి మొబైల్ నోకియా అంటూ సమాధానం చెప్పారు సూపర్ స్టార్. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతానికి పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారిపాట అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు సూపర్ స్టార్. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sankranti 2022 – Movies: సంక్రాంతి బరిలో నిలిచి.. బాక్సాఫీస్ వద్ద వార్‌కు సై అంటున్న స్టార్ హీరోలు..

Parineeti Chopra: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ అందాలను వలకపోస్తున్న పరిణితీ చోప్రా లేటెస్ట్ ఫొటోస్..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి కొత్తగా వచ్చిన అతిథి.. ఎవరో తెలుసా?