Republic Pre-Release Event: తేజ్ ఒక సైనికుడిలా ఈ సినిమాని నడిపించాడు : దేవకట్టా
సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హారాజయ్యారు.
Republic Pre-Release Event: సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హారాజయ్యారు. రిపబ్లిక్ సినిమా తప్పకుండ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్నారు. అలాగే దేవకట్ట గత సినిమాలు.. ప్రస్థానం సినిమా చూసా.. ఆటో నగర్ సినిమా గురించి నిర్మాతలు చెప్పారు. పాథమిక హక్కులగురించి చెప్పే సినిమానే రిపబ్లిక్ అని అన్నారు. చిన్నతనం నుంచి జై హింద్ అనకుండా సభను ముగించాను.. లెక్కలేనంత మహానుభావులు ప్రాణత్యాగం చేస్తే కానీ గణతంత్ర దేశంగా భారత్ అవతరింపబడలేదు అన్నారు పవన్. అలాగే హరీష్ శంకర్ మాట్లాడుతూ.. తేజ్ నన్ను ఎప్పుడు హరీష్ అన్న హరీష్ అన్న అంటువుంటాడు.. పవన్ కళ్యాణ్ తేజు అనుభందం తండ్రి కొడుకుల అనుబంధం.. అందరూ హీరోల ఫ్యాన్స్ తేజ్ కోలుకోవాలని కోరుకున్నారు..కరోనా ఫస్ట్ వేవ్ తరువాత సోలో బ్రతికే సో బెటర్ వచ్చింది. సెకండ్ వేవ్ తరువాత మళ్ళీ ఈ సినిమా వస్తుంది..థియేటర్ మనకు ఎన్నో అనుభూతులను ఇస్తుంది..మళ్ళీ థియేటర్స్ కి జనం రావడం ఆనందంగా వుంది… కొన్ని సినిమాలో ఓటీటీలో రిలీజ్ చేశారు అయితే ఆ నిర్మాతలకు ప్రాబ్లమ్స్ ఏమిటో మనకు తెలీదు అన్నారు. అదేవిధంగా దేవా కట్టా మాట్లాడుతూ.. తేజ్ కి ఈ సినిమా లైన్ మాత్రం చెప్పాను. దానికి కనెక్ట్ అయ్యి నా తో ఒట్టు వేయించుకున్నారు. అప్పటి నుంచి ఒక సైనికుడులా ఈ సినిమాని నడిపించాడు. ఈ ఫిలిం నా లిబరేషన్. ఈ సినిమా పరిపూర్ణంగా నా విజన్ తో చేశాను అన్నారు. హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. అన్నయ్య ను టైం హాస్పిటల్ కి తీసుకెళ్లిన వారికి థాంక్స్.. ప్రాణాలను డాక్టర్లు కాపాడిన మీ అందరి ఆశీస్సులతో కోలుకుంటున్నాడు మీ అందరికీ నా మనవి డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :