Gold-Silver Price Today: తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధర, భారీగా తగ్గిన వెండి ధర..

Gold-Silver Price Today(september 26th 2021) : బంగారం రేట్లు ద్రవ్యోల్బణం అంతర్జాతీయంగా ధరలు మార్పు, కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, వడ్డీ రేట్లు నిలకడలేని, నగల మార్కెట్లు సహా అనేక అంతర్జాతీయ..

Gold-Silver Price Today: తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధర, భారీగా తగ్గిన వెండి ధర..
Gold And Silver
Follow us
Surya Kala

|

Updated on: Sep 26, 2021 | 7:13 AM

Gold-Silver Price Today(september 26th 2021) : బంగారం రేట్లు ద్రవ్యోల్బణం అంతర్జాతీయంగా ధరలు మార్పు, కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, వడ్డీ రేట్లు నిలకడలేని, నగల మార్కెట్లు సహా అనేక అంతర్జాతీయ అంశాలపై ప్రభావం ఇవి గ్లోబల్ గోల్డ్ రేట్లు ఆధారపడి ఉంటాయి. ఇక భారతీయ ప్రజలకు బంగారం, వెండి లోహాలు అలంకరణ కోసమేకాదు ఆర్ధికంగా అత్యవసరమైతే తమను ఆదుకుంటుందని భావిస్తారు. అందుకనే ఏ  చిన్న సందర్భం దొరికినా బంగారం, వెండి కొనుగోలుకు ఆసక్తిని చూపిస్తారు. బంగారంపై వివిధ రూపాయల్లో పెట్టుబడి పెడతారు. ముఖ్యంగా వివాహం, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. విలువైన లోహాన్ని నగలు, నాణేలుగా విక్రయిస్తారు. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి  గుడ్ న్యూస్. గత రెండు రోజులుగా పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతేకాదు వెండి ధరకూడా భారీగా తగ్గింది. ఈరోజున తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో బంగారం ధరలు, వెండి ధరలు  ఎలా ఉన్నాయో చూద్దాం..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో  బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాము నిన్న రూ. 4,320లు  ఉండగా ఈరోజు కూడా అదే ధర కొనసాగుతుంది.  అంతేకాదు క 10గ్రాముల బంగారం ధర కూడా నిన్న ఉన్న రూ. 43,200లే కొనసాగుతుంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర ధర కూడా   రూ. 4,713లతో.. 10 గ్రాముల బంగారం ధర  నిన్నటి ధర రూ. 47,130 కొనసాగుతుంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడ, సికింద్రాబాద్లో, వరంగల్ లో కూడా కొనసాగుతున్నాయి.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు: 

దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర..  రూ. 45,240, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర. రూ. 46,240 కొనసాగుతున్నాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో నేడు 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర..ఢిల్లీలో రూ. 45,350, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర. రూ. 49,480 ఉంది.

 వెండి ధర:

శనివారం రోజున వెండి ధరలు భారీగా తగ్గింది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధర రూ. 800 మేర తగ్గింది. దీంతో హైదరాబాద్ లో కిలో వెండి రూ. 64,100లుగా ఉంది. ఇదే ధరలు విజయవాడ, విశాఖ పట్నం లో కూడా కొనసాగుతున్నాయి.

Also Read: Horoscope Today: రాశిఫలాలు నేడు…. ఏ రాశివారికి గ్రహబలం అనుకూలంగా ఉండి చేపట్టిన పనులు జరుగుతాయంటే..