Guinness Record: గిన్నీస్ బుక్‌లోకి ఎక్కిన శునకం..! ఏ విషయంలో తెలిస్తే షాక్‌ అవుతారు..?

Guinness Record: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఇప్పటివరకు చాలా రికార్డులు నమోదయ్యాయి. ఇందులో మనుషులకే కాదు జంతువుల రికార్డులు కూడా ఉన్నాయి.

Guinness Record: గిన్నీస్ బుక్‌లోకి ఎక్కిన శునకం..! ఏ విషయంలో తెలిస్తే షాక్‌ అవుతారు..?
Dog Lou
Follow us

|

Updated on: Sep 26, 2021 | 3:25 PM

Guinness Record: గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఇప్పటివరకు చాలా రికార్డులు నమోదయ్యాయి. ఇందులో మనుషులకే కాదు జంతువుల రికార్డులు కూడా ఉన్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ఓ కుక్క ఇందులో చోటు సంపాదించింది. అయితే ఆ కుక్క ఏ విషయంలో ఈ ఫీట్‌ సాధించిందో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆ వివరాలను గురించి తెలుసుకుందాం.

అమెరికాలోని ఒరెగాన్‌లో లౌ (కుక్క పేరు) అనే 3 ఏళ్ల కుక్క చెవి పొడవు 13.38 అంగుళాలు ఉంది. దీంతో ప్రపంచంలో అత్యధిక పొడవు కలిగిన చెవులు ఉండటం వల్ల గిన్నీస్ వరల్డ్‌ రికార్డ్‌ సాధించింది. అయితే లూ యజమానికి ఈ విషయం చాలా రోజుల క్రితమే తెలుసు కానీ ఎప్పుడు ఆమె లూ చెవులను కొలవడానికి ప్రయత్నం చేయలేదు. ఆమె తరచు లూ పొడవాటి చెవులను గమనించేది. కానీ వాటిని కొలవడానికి సమయం లేకపోవడం వల్ల వాయిదా వేస్తూ ఉండేది.

చివరకు కరోనా మహమ్మారి సమయంలో దానిని కొలవాలని నిర్ణయించుకుంది. లూ చెవులను కొలిచినప్పుడు అది 34 సెంటీమీటర్లు అంటే 13.38 అంగుళాలుగా ఉంది. ఆ తర్వాత ఈ విషయం ఆమె గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ నిర్వాహకులకు తెలిపింది. దీంతో వారు పరిశీలించి లూ పేరును గిన్నీస్‌ బుక్‌లో నమోదు చేశారు. లౌ నలుపు, లేత రంగు కలిగిన కుక్క. పొడవాటి చెవులు దాని అందాన్ని మరింత పెంచుతున్నాయి. అంతేకాదు ఈ కుక్క అమెరికన్ కెన్నెల్ క్లబ్, ర్యాలీ విధేయతలో టైటిల్స్ కూడా గెలుచుకుంది.

Blood Pressure: బీపీని కంట్రోల్‌ చేయాలంటే ఎటువంటి ఆహారం తినాలి..! ఏ సమయంలో తీసుకుంటే మంచిది..

UNGA: యూఎన్ జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్‌ను ఏకి పారేసిన భారత ఐరన్ లేడీస్.. పాక్‌ను అంతర్జాతీయంగా ఎలా అభాసు పాలు చేశారంటే..

Viral Video: షాపింగ్ పూర్తి చేసుకుని 10 నిమిషాల్లో వచ్చి చూస్తే షాక్.. కారులో భారీ గూడు కట్టిన తేనెటీగలు

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..