Viral Video: షాపింగ్ పూర్తి చేసుకుని 10 నిమిషాల్లో వచ్చి చూస్తే షాక్.. జీప్‌లో భారీ గూడు కట్టిన తేనెటీగలు
తేనెటీగలు అటాక్ చేస్తే ఎట్టా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటి దాడుల్లో చనిపోయినవారు కూడా ఉన్నారు. కాగా తమ జోలికి రానంతవరకు...
తేనెటీగలు అటాక్ చేస్తే ఎట్టా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటి దాడుల్లో చనిపోయినవారు కూడా ఉన్నారు. కాగా తమ జోలికి రానంతవరకు తేనెటీగలు ఎవరికీ హాని చేయవు. ‘రాణి’ ఈగను గూడులోని మిగిలిన ఈగలన్నీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఆ గూడు జోలికి ఎవరైనా వస్తే మాత్రం అవి ప్రాణాలను కూడా లెక్కచేయవు. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎవరున్నా సరే వెంటాడుతాయి.. వేటాడుతాయి. తేనెటీగలు ఎక్కువగా చల్లదనం ఉన్న ప్రాంతాలలో, మరుగు స్థలాల్లో తమ గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయి. తాజాగా తేనెటీగలు రోడ్డుపై పార్క్ చేసిన ఓ జీప్‌లో గూడు పెట్టేశాయి. అది కూడా 10 నిమిషాల వ్యవధిలోనే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
రిజ్వాన్ ఖాన్ అనే వ్యక్తి సిడ్నీలోని లకేంబాలోని హాల్డన్ స్ట్రీట్‌లో తన జీప్‌ను రోడ్డు పక్కన పార్క్ చేసి.. పక్కనే ఉన్న గ్రాసరీస్ స్టోర్‌లోకి వెళ్లాడు. తనకు కావాల్సినవి కొనుక్కుని 10 నిమిషాల అనంతరం కార్ దగ్గరకు వచ్చాడు. జీప్ డోర్ తీసేందుకు ప్రయత్నించి షాక్ తిన్నాడు. ఎందుకంటే తేనెటీగలు జీపు లోపలికి ప్రవేశించి.. డ్రైవర్ సీటు దగ్గర పై భాగంలో గూడు ఏర్పరుచుకునే పనిలో ఉన్నాయి. వెంటనే తేరుకున్న రిజ్వాన్ ఖాన్ ఆ దృశ్యాన్ని వీడియో తీశాడు. ఆపై సదరు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. “చాలా సంతోషకరమైన వసంతం. తేనెను నేను పెద్దగా ఇష్టపడను. కానీ నేను తేనెటీగల నుంచి ప్రేమను పొందాను. బహుశా అవి నా జీప్‌ను ఇష్టపడి ఉండవచ్చు” అని అతడు రాసుకొచ్చాడు.
అదృష్టవశాత్తూ, స్థానిక తేనెటీగల పెంపకందారుడు గందరగోళాన్ని గమనించి రిజ్వాన్‌కు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. వాటిని జీప్ నుంచి చేతులతో తొలగించిన సదరు వ్యక్తి.. ఓ బాక్స్‌లో బంధించి ఇంటికి తీసుకెళ్లాడు.
A very happy spring! Not a big fan to honey but the Love I received???#sydney #spring #bees #JeepWrangler pic.twitter.com/M3qqq5K9A5
— Rizwan Khan (@KhanAarr) September 24, 2021
https://t.co/7UklWHrh2B pic.twitter.com/k0308Duuj3
— Rizwan Khan (@KhanAarr) September 24, 2021
Also Read: తుఫాను వేళ ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు.. చేయాల్సినవి, చేయకూడనివి