Cyclone Gulab: తుఫాను వేళ ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు.. చేయాల్సినవి, చేయకూడనివి

ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ప్రభావం అత్యంత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు విపత్తు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. IMD విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం గులాబ్ తుఫాను ఒడిషా, ఆంధ్రాపై నాలుగు రోజుల పాటు ప్రభావం చూపనున్నట్లుగా పేర్కొంది.

Cyclone Gulab: తుఫాను వేళ ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు.. చేయాల్సినవి, చేయకూడనివి
Cyclone Gulab
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 26, 2021 | 2:03 PM

ఆంధ్రా- ఒడిశాను గులాబ్ తుఫాను వణికిస్తోంది. తుఫాన్ ఈరోజు సాయంత్రం తీరం దాటనుండటంతో ఏపీ  విపత్తుల నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆ వివరాలు మీకోసం

ఇంట్లో ఉంటే/ If indoors

• ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి, అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలు, గ్యాస్ కనెక్షలను తీసివేయండి. • తలుపులు, కిటికీలు మూసివేసి ఉంచండి. • మీ ఇల్లు సురక్షితం కాకపోతే, తుఫాను ప్రారంభం కాకముందే సురక్షితమైన ఆశ్రయం/షెల్టర్ కు చేరుకోండి. • రేడియో న్యూస్ వినండి, అధికారిక హెచ్చరికలపై మాత్రమే ఆధారపడండి. • వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు మాత్రమే త్రాగాలి. • భవనం కూలిపోవటం జరుగుతుంటే, దుప్పట్లు, రగ్గులు లేదా దుప్పట్లతో లేదా బలమైన టేబుల్ లేదా బెంచ్ కిందకు దూరడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోండి.

బయట ఉంటే / If outdoors

• దెబ్బతిన్న/పాత భవనాల్లోకి ప్రవేశించవద్దు. • వీలైనంత త్వరగా సురక్షితమైన ఆశ్రయం/షెల్టర్ కు చేరుకిండి. • చెట్టు / విద్యుత్ స్తంభం కింద ఎప్పుడూ నిలబడకండి. • వాతావరణం ప్రశాంతంగా ఉంటే జాగ్రత్తగా నిశితంగా వేచి చుడండి. తుఫాను ముగిసిందని అనుకోకండి, ఒక్కసారిగాపెద్ద/హింసాత్మక గాలులు మరొక దిశ నుండి తిరిగి ప్రారంభమవవచ్చు, అధికారిక ఉత్తర్వులు ‘ఆల్ క్లియర్’ అని వచ్చేంతవరకు సహనంతో ఉండండి.

తుఫాను తరువాత/ After cyclone

• వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు మాత్రమే త్రాగాలి. • అధికారికంగా సమాచారం వచ్చేవరకు బయటకు వెళ్లవద్దు. మిమ్మల్ని షెల్టర్/ఆశ్రయంలో ఉంచినట్లయితే అధికారులు చెప్పేవరకు తిరిగి వెళ్ళవద్దు. • విరిగిన విద్యుత్ స్తంభాలు, వదులుగా ఉండే తీగలు/తెగిన తీగలు, ఇతర పదునైన వస్తువుల నుండి జాగ్రత్తలు తీసుకోండి. • దెబ్బతిన్న/పడిపోయిన భవనాల్లోకి ప్రవేశించవద్దు. • దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను/వస్తువులను వాడే ముందు వాటిని ఎలక్ట్రీషియన్ చేత తనిఖీ చేయంచండి.

మత్స్యకారులు చేయవలసినవి/ Fishermen Should

• పుకార్లను నమ్మకండి, ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దు. • మొబైల్ ఫోన్లను అత్యవసర సమయంలో వాడుటకు/కమ్యూనికేషన్ కు ఎప్పుడూ ఛార్జ్ చేసి ఉంచండి, SMS లను చూస్తూ ఉండండి. • ముఖ్యమైన ఫోన్ నంబర్స్ ను కాగితంపై వ్రాసి సురక్షితంగా ఉంచండి. • అదనపు బ్యాటరీలతో రేడియోను మీతో ఉంచుకోండి. • వాతావరణ సమాచారం/హెచ్చరికల కోసం, రేడియో న్యూస్ వినండి, టీవీ చూడండి, వార్తాపత్రికలు చదవండి. • పడవలు / తెప్పలను సురక్షితమైన ప్రాంతంలో కట్టి ఉంచండి. • సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దు.

Also Read:  ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న ‘గులాబ్’.. సముద్రంలో అలజడి

 గబ్బర్‌ సింగ్‌పై కౌంటర్‌ ఎటాక్‌… పవన్‌పై విరుచుకుపడ్డ మంత్రి వెల్లంపల్లి.. తీవ్ర వ్యాఖ్యలు