Andhra Pradesh: భారత్ బంద్‌కు ఏపీ సర్కార్ మద్ధతు.. తీవ్రంగా మండిపడిన బీజేపీ అధ్యక్షుడు..
Andhra Pradesh: కాంగ్రెస్, వామపక్షాలు, రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్‌కు వైసీపీ ప్రభుత్యం మద్దతు ఇవ్వడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు.
Andhra Pradesh: కాంగ్రెస్, వామపక్షాలు, రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్‌కు వైసీపీ ప్రభుత్యం మద్దతు ఇవ్వడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో గాడి తప్పిన ప్రభుత్వ పాలనను కపీపుచ్చకోవడం కోసమే మద్దతు ప్రకటించారని దుయ్యబట్టారు. ఇదే అంశంపై ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన సోమువీర్రాజు.. ఆర్ధిక పరిస్థితులు అయోమయంగా ఉన్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికే రాష్ట్ర ప్రభుత్వం భారత్ బంద్‌కు మద్దతు ఇచ్చిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాల గురించి అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని అన్నారు. ప్రధానమంత్రి రైతు సంక్షేమంపై దృష్టి పెట్టారని అన్నారు. ఇందులో భాగంగానే వారు పండించిన పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. రైతులకు మేలు చేసే సంస్కరణలను స్వాగతించాల్సింది పోయి.. అందుకు విరుద్ధంగా అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
రైతులకు నేరుగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడమే కాకుండా.. దేశవ్యాప్తంగా యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా నిలువరించిన ఘటన బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కూడా రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రత్యేక రైళ్లు ద్వారా రవాణా చేయడం జరిగిందన్నారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి భారత్ బంద్‌కు పిలుపునిస్తే.. ఆ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించడం అనైతిక నిర్ణయం అని విమర్శించారు. రైతు చట్టాలపై చర్చించేందుకు కేంద్రం సిద్ధం అన్నప్పటికీ.. బంద్‌కు మద్ధతు పలికిన పార్టీలు ఎందుకు చర్చలకు వెళ్లడం లేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also read:
Hyderabad Crime: పెళ్లై నెల రోజులు కూడా కాలేదు.. కట్టుకున్న భార్యను క్రూరంగా చంపేశాడు కిరాతకుడు..
Pawan vs YCP: పవన్ కళ్యాణ్ అంతలా ఉలిక్కి పడటానికి కారణమేంటి?.. మంత్రి అనిల్ కుమార్ ఫైర్..