Hyderabad Crime: పెళ్లై నెల రోజులు కూడా కాలేదు.. కట్టుకున్న భార్యను క్రూరంగా చంపేశాడు కిరాతకుడు..

Hyderabad Crime: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. పైళ్లి చేసుకుని నెల రోజులు కూడా నిండక ముందే.. ఓ వ్యక్తి తన భార్యను అత్యంత క్రూరంగా చంపేశాడు.

Hyderabad Crime: పెళ్లై నెల రోజులు కూడా కాలేదు.. కట్టుకున్న భార్యను క్రూరంగా చంపేశాడు కిరాతకుడు..
Crime News
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 26, 2021 | 1:45 PM

Hyderabad Crime: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. పైళ్లి చేసుకుని నెల రోజులు కూడా నిండక ముందే.. ఓ వ్యక్తి తన భార్యను అత్యంత క్రూరంగా చంపేశాడు. గొంతు, కాళ్లు, చేతులు కోసి దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకెళితే.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గంగారాం దేవునిపల్లిలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నాడు. గంగారం కూతురు సుధారాణిని కామారెడ్డి పట్టణానికి చెందిన కిరణ్ కుమార్‌కి ఇచ్చి గత నెల 27న వివాహం జరిపించాడు. పెళ్లి సమయంలో 14 లక్షల రూపాయల నగదు, కామారెడ్డిలో ఒక ప్లాట్, సుమారు 10 తులాల బంగారం వరకట్నంగా ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ.. కొద్దిరోజుల క్రితం సుధారాణి గొంతు పిసికి హత్యాయత్నానికి ప్రయత్నించాడు భర్త కిరణ కుమార్. ఆ తరువాత పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చి కూతురును కాపురానికి పంపించారు. అయితే, వారం రోజుల క్రితం భార్యను తీసుకుని హైదరాబాద్‌లోని ప్రగతి నగర్‌లోని సొంత ఇంట్లోకి షిప్ట్ అయ్యాడు కిరణ్ కుమార్.

ఇంతలో శనివారం మధ్యాహ్నం కూతురును చూడటానికి రావాలంటూ సుధారాణి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు కిరణ్ తల్లిదండ్రులు. ఫోన్ చేసిన అనంతరం కిరణ్ కుమార్ తల్లిదండ్రులు కామారెడ్డికి బయలుదేరారు. ఇక సుధారాణి తల్లిదండ్రులు మధ్యాహ్నం 1 గంట వరకు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇంటికి వెళ్లడగా డోర్ పెట్టి ఉండటంతో.. కాలింగ్ బెల్ కొట్టారు, పిలిచారు. ఎంత పిలిచినా పలకక పోవడంతో.. పడుకున్నారేమోనని భావించి సాయంత్రం 4 గంటల వరకు వేచి చూశారు. మళ్ళీ పిలిచినా స్పందన లేకపోవడంతో కామారెడ్డిలోని తమ బంధువులకు ఫోన్ చేసి చెప్పారు సుధారాణి తల్లిదండరులు. రాత్రి 9 గంటల వలరకు అలాగే ఉండి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా.. బెడ్‌పై సుధారాణి విగతజీవిగా పడి ఉంది. సుధారాణి గొంతు, కాళ్లు, చేతులు కోసిన కిరణ్ కుమార్.. తానుకూడా గొంతు, ఎడమ చేయి కోసుకున్నాడు. కొనప్రాణంతో ఉన్న కిరణ్ కుమార్‌ను ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, తమ అమ్మాయిని చంపారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామారెడ్డిలోని కిరణ్ కుమార్ ఇంటిపై అమ్మాయి బంధువులు దాడి చేశారు. ఇంట్లో ఉన్న వస్తువులు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. కిరణ్ కుమార్ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Pawan vs YCP: పవన్ కళ్యాణ్ అంతలా ఉలిక్కి పడటానికి కారణమేంటి?.. మంత్రి అనిల్ కుమార్ ఫైర్..

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ తేదీల్లో చిన్న ఛేంజ్.. మార్చిన తేదీల వివరాలివే..

AP Politics: సంక్షోభంలో ఏపీ వ్యవసాయ రంగం.. సంచలన కామెంట్స్ చేసిన మాజీ మంత్రి..