Pawan vs YCP: పవన్ కళ్యాణ్ అంతలా ఉలిక్కి పడటానికి కారణమేంటి?.. మంత్రి అనిల్ కుమార్ ఫైర్..

Pawan vs YCP: రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ వేడుకలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఫైర్ అవుతున్నారు.

Pawan vs YCP: పవన్ కళ్యాణ్ అంతలా ఉలిక్కి పడటానికి కారణమేంటి?.. మంత్రి అనిల్ కుమార్ ఫైర్..
Anil Pawan Kalyan
Follow us

|

Updated on: Sep 26, 2021 | 1:41 PM

Pawan vs YCP: రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ వేడుకలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగాస్పందించారు. పవన్ కళ్యాణ్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం అనేది ఒకటే అని అన్నారు. ఆన్‌లైన్ పోర్టల్ అంటే ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. దానివల్ల జరిగే నష్టం ఏంటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ అంతలా ఉలికి పడటానికి కారణమేంటని అన్నారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్.. ఆన్‌లైట్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపారని తెలిపారు.

అకౌంటబులిటీ రావాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అని పేర్కొన్నారు. పారదర్శకత కోసమే ఆన్‌లైన్ పోర్టల్ తీసుకువస్తున్నట్లు తెలిపారు. సినిమా ఖర్చులో కేవలం నలుగురైదుగురికి మాత్రమే లబ్ధి ఎక్కువగా ఉంటుందని, ఇది ఎంత వరకు సబబు అని మంత్రి అనిల్ ప్రశ్నించారు. తన ఒక్కడిపై కోపంతోనే చిత్రపరిశ్రమను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పవన్ కళ్యాణ్ మాట్లాడటం సరికాదన్నారు. అందరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేదే తమ ఉద్దేశం అని, పారదర్శకత కోసమే ఆన్‌లైన్ పోర్టల్‌ను తీసుకువస్తున్నట్లు తెలిపారు. చిత్రపరిశ్రమను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని, ఇది కేవలం పవన్ కళ్యాణ్ వక్రీకరించి చేస్తున్న ఆరోపణలు మాత్రమే అని మంత్రి అనిల్ స్పష్టం చేశారు.

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ అలా మాట్లాడినట్లు స్పష్టమవుతోందని మంత్రి అనిల్ అన్నారు. చిత్ర పరిశ్రమనంతా ఇబ్బంది పెడుతున్నామని ప్రొజెక్షన్ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదన్నారు. రాజకీయ ఉనికి కోసం సీఎం జగన్‌ను తిట్టడం పవన్ కళ్యాణ్‌కు ఫ్యాషన్ అయిపోయిందన్నారు. ‘‘ప్రభుత్వ తీరును మారుస్తాను.. నేను రోడ్డుమీదకొస్తే మనిషిని కాదు.. బెండు తీస్తాం..’’ అని మాట్లాడటం పవన్ కళ్యాణ్‌కు కొత్తేం కాదని, ఆయన విజ్ఞతతో మాట్లాడితే బాగుంటుందని సున్నితంగా హెచ్చరించారు మంత్రి అనిల్. రెండు జెడ్పీటీసీలు, ఎంపీటీసీకే ఎగెరెగిరి పడుతున్నారని.. విమర్శించారు.

Also read:

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ తేదీల్లో చిన్న ఛేంజ్.. మార్చిన తేదీల వివరాలివే..

AP Politics: సంక్షోభంలో ఏపీ వ్యవసాయ రంగం.. సంచలన కామెంట్స్ చేసిన మాజీ మంత్రి..

AP Crime News: కర్నూలు జిల్లాలో దారుణం.. పురుగులమందు తాగిన యువతి, యువకుడు.. కారణమేంటంటే..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన