Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime News: కర్నూలు జిల్లాలో దారుణం.. పురుగులమందు తాగిన యువతి, యువకుడు.. కారణమేంటంటే..

Suicide Attempt: కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతి, యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న..

AP Crime News: కర్నూలు జిల్లాలో దారుణం.. పురుగులమందు తాగిన యువతి, యువకుడు.. కారణమేంటంటే..
Crime
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 26, 2021 | 11:05 AM

Suicide Attempt: కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతి, యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం బాపురం గ్రామ సమీపంలో ఉన్న తుంగభద్ర దిగువ కాలువ(LLC) ఒడ్డున ఓ యువతి, యువకుడు పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పురుగుల మందు తాగిన ఆ ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వీరిని గమనించిన స్థానికులు.. వెంటనే 108 ఆంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. 108 ద్వారా బాధితులిద్దరినీ ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వీరిని పరిశీలించిన వైద్యులు.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. చికిత్స అందిస్తున్నామన్నారు. కాగా, వీరి ఆత్మహత్యాయత్నంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరూ ఆత్మహత్యయత్నానికి పాల్పడటానికి ప్రేమ వ్యవహారం కారణమా? లేక మరొకటా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ యువకుడిది ఆదోని, యువతి ది హాలహర్వి మండలం సిద్ధాపురం గ్రామంగా పోలీసులు గుర్తించారు.

Also read:

Rent A Girlfriend: అమ్మానాన్నల కోసం అద్దెకు గర్ల్ ఫ్రెండ్.. లక్షల్లో ఖర్చు చేస్తున్న యువత ఎక్కడంటే..

ఐక్యరాజ్యసమితి కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు.. ఆందోళనకు దిగిన బాల్టిస్తాన్ నిరసనకారులు

IPL 2021: తొలి ఆరు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా కొట్టని రాజస్తాన్‌ రాయల్స్