Crime News: తల్లి ఒడి చేరిన శిశువు.. 24 గంటల్లో కేసును చేధించిన కృష్ణా జిల్లా పోలీసులు
AP krishna district police: కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు రోజుల పసికందు అపహరణకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును కృష్ణా
AP krishna district police: కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు రోజుల పసికందు అపహరణకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును కృష్ణా జిల్లా పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. అపహరణకు గురైన పసికందును 24 గంటల్లో తల్లి ఒడికి చేర్చినట్లు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వెల్లడించారు. వాలంటీర్, మహిళా పోలీస్ సమాచారంతో ఈ కేసును చేధించినట్లు పోలీసులు వెల్లడించారు. శిశువును అపహరించిన మహిళను అదుపులోకి తీసుకోని.. పసికందును తల్లి ఒడికి చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. సచివాలయ వ్యవస్థ ఉండటం వల్లే ఈ కేసును త్వరితగతిన పూర్తి చేయగలిగామని ఎస్పీ తెలిపారు. మహిళ ఎందుకు పసి పాపను ఎత్తుకెళ్లిందని అనే విషయంపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందని తెలిపారు. అయితే.. శిశువును తీసుకెళ్లిన మహిళకూ.. శిశువు తల్లిదండ్రులకు ఎటువంటి సంబంధమూ లేదని తెలిపారు. విచారణ అనంతరం త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వెల్లడించారు. నిందితురాలు బంటుమిల్లి మండలం సుంకరపాలేనికి చెందిన మహిళ అని దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు.
కాగా.. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఐదురోజుల పసికందు అపహరణకు గురైంది. తమ చిన్నారి కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని ఆసుపత్రి నుంచి ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు గుర్తించి.. మహిళ ఆచూకీని గుర్తించారు. శిశువు క్షేమంగా దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: