Crime News: దారుణం.. పెళ్లి చేసుకున్న నెలకే కడతేర్చాడు.. భార్యను గొంతుకోసి చంపిన భర్త.. ఆ తర్వాత
Man murderd his wife: హైదరాబాద్ పరిధిలోని ప్రగతినగర్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లై నెల రోజులు కాకముందే.. భర్త భార్య పాలిట శాపంలా మారాడు. నవ వధువు
Man murderd his wife: హైదరాబాద్ పరిధిలోని ప్రగతినగర్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లై నెల రోజులు కాకముందే.. భర్త భార్య పాలిట శాపంలా మారాడు. నవ వధువు గొంతు కోసి దారుణంగా హత్యచేశాడు. అనంతరం అతను కూడా హత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామానికి చెందిన పుట్టల గంగారాం చిన్న కూతురు సుధారాణి(22)కి ఎర్రోల కిరణ్ కుమార్‌కు గత నెల 28న వివాహమైంది. కిరణ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వివాహమైన అనంతరం భార్యభర్తలిద్దరూ.. ప్రగతినగర్‌లోని శ్రీ సాయి ద్వారకా అపార్ట్మెంట్‌లో నివాసముంటున్నారు.పెళ్లియిన వారం రోజుల నుంచే కిరణ్ సుధారాణి పై అనుమానంతో మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో.. సుధా తల్లిదండ్రులు నిన్న సాయంత్రం కూతురు నివాసముంటున్న ప్రగతి నగర్లోని అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. అనంతరం ఇంటికి వచ్చి చూడగా డోర్ లోపలి వైపు నుంచి లాక్ చేసి ఉంది. ఫోన్ చేసినప్పటికీ.. లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన సుధా తల్లిదండ్రులు.. బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తీసి చూడగా.. సుధా రక్తపు మడుగులో పడి ఉంది. శరీరం నిండా కత్తితో కోసిన గాయాలు ఉన్నాయి. అప్పటికే సుధా మృతి చెందిఉన్నట్లు పోలీసులు తెలిపారు. కిరణ్ కూడా ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి ఒంటిపైన కూడా కత్తి గాయాలున్నాయని తెలిపారు. అనంతరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం సుధా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కిరణ్ ప్రస్తుతం నిజాంపేట హోలిస్టిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: