మణుగూరులో గుప్తనిధుల కలకలం.. దేవతా విగ్రహానికి రక్తాభిషేకం.. వీడియో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. గుప్త నిధుల కోసం గ్రామ దేవతకు రక్తతర్పణం చేశారు దుండగులు. అది చూసి స్థానిక ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. గుప్త నిధుల కోసం గ్రామ దేవతకు రక్తతర్పణం చేశారు దుండగులు. అది చూసి స్థానిక ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం మల్లంపాడు చెరువు పక్కన ముత్యాలమ్మ ఆలయం ఉంది. ఆ ఆలయంలో గుప్త నిధులు ఉన్నాయని భావించిన కొందరు దుండగులు.. పూజాక్రతువులు నిర్వహించారు. ముత్యాలమ్మ విగ్రహానికి రక్తాభిషేకం చేశారు. అక్కడే పూజాసామాగ్రి, కోడిని వదిలిపెట్టారు.
మరిన్ని ఇక్కడ చూడండి: వరంగల్ ఎనుమాముల మార్కెట్ తెల్ల బంగారం మెరిసింది.. క్వింటా 7వేలకు పైనే.. వీడియో
CCTV Cameras: సీసీటీవీ కెమెరా అమర్చుకోవాలని చూస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
వైరల్ వీడియోలు
Latest Videos