R. Madhavan : రాకెట్రీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మాధవన్.. సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనట..

తమిళ్ స్టార్ హీరో మాధవన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే..లవర్ బాయ్‌గా సౌత్ ఇండియన్ సినిమాల్లో మాధవన్ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

R. Madhavan : రాకెట్రీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మాధవన్.. సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనట..
R. Madhavan
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 26, 2021 | 3:37 PM

R. Madhavan: తమిళ్ స్టార్ హీరో మాధవన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే.. లవర్ బాయ్‌గా సౌత్ ఇండియన్ సినిమాల్లో మాధవన్ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మాధవన్‌కు. ఆయన నడిచిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. ఆయన నటించిన సఖి, చెలి, రన్ సినిమాలు తెలుగులో మంచి విజయాలను అందుకున్నాయి. చాలా కాలం తర్వత మాధవన్.. నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాలో విలన్‌గా నటించి మెప్పించారు. ఈ సినిమా తర్వాత ఇటీవలే అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే మరోసారి విలన్‌గా మెప్పించడానికి మాధవన్ రెడీ అవుతున్నారని తెలుస్తుంది. ఎనర్జిటిక్ హీరో రామ్ తమిళ్ దర్శకుడు లింగు స్వామి డైరెక్షన్లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మాస్ యాక్షన్ కథాంశంతో రాబోతుంది. ఈ సినిమాలో మాధవన్ విలన్‌గా నటిస్తున్నారని అంటున్నారు.

ఇక ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ బయోపిక్‌గా వస్తున్న చిత్రం ‘రాకెట్రీ’.. ఈ సినిమా మాధవన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో నంబి నారాయణ్ ఒకరు. కాగా ఒకానొక టైమ్‌లో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి 50 రోజుల పాటు జైల్లో పెట్టారు. తర్వాత సుప్రీం కోర్టు ఆ కేసు కొట్టేసింది. ఆ సైంటిస్ట్ జీవితాన్నే మాధవన్ తెరపై ఆవిష్కరించబోతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ పై హీరో మాధవన్ క్లారిటీ ఇచ్చారు. పాన్ ఇండియా సినిమా కావడం వల్ల దేశవ్యాప్తంగా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకునే వరకు విడుదల చేయలేమని మాధవన్ తెలిపారు. నార్త్‌లో కూడా ‘రాకెట్రీ’ మంచి ప్రభావం చూపుతుందని.. మహారాష్ట్ర వంటి రాష్ట్రంలో థియేటర్లు ఓపెన్ కానప్పుడు సినిమాను ఎలా విడుదల చేస్తామని మాధవన్ అన్నారు. థియేటర్స్ పూర్తిస్థాయిలో ఓపెన్ అయ్యిన తర్వాత సినిమాను రిలీజ్ చేయనున్నారు. మాధవన్ ప్రధాన పాత్రలో నటించడమే కాదు.. స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Natural Star Nani : సీఎం జగన్‌కు హీరో నాని రిక్వెస్ట్.. పవన్ కళ్యాణ్‌కు థాంక్స్..

Mahesh Babu : వెబ్ సిరీస్ చేసే ఆలోచన ఉందా..? క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్..

Balakrishna: బాలయ్య రిజెక్ట్ చేసిన సినిమాలు .. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం.. ఈ హీరోలకు వెరీవెరీ స్పెషల్

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా