Mahesh Babu : వెబ్ సిరీస్ చేసే ఆలోచన ఉందా..? క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. సర్కారు వారి పాట అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా

Mahesh Babu : వెబ్ సిరీస్ చేసే ఆలోచన ఉందా..? క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్..
Mahesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 26, 2021 | 3:10 PM

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. సర్కారు వారి పాట అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ చాలా స్టైలిష్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ సినిమాలే అంచనాలను ఆకాశానికి చేర్చాయి.. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుందని తెలుస్తుంది. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. గతంలో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో అతడు, ఖలేజా వంటి సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే.. దాంతో ఇప్పుడు రాబోతున్న ఈ  హ్యాట్రిక్ సినిమా పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

ఇక ప్రస్తుతం సినిమాతారలందరు ఓటీటీ బాట పడుతున్న విషయం తెల్సిందే.. టాలీవుడ్‌లోనూ పలువురు వెబ్ స్టోరీస్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు కూడా వెబ్ స్టోరీస్ చేసే అవకాశం ఉందంటూ కొంతకాలంగా ఓ వార్త వినిపిస్తుంది. ఈ వార్తల పై సూపర్ స్టార్ క్లారిటీ ఇచ్చారు.. తాజాగా బిగ్ సి మొబైల్ స్టోర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మహేష్ మాట్లాడారు. పలువురు స్టార్స్ వెబ్ సిరీస్‌లు చేసేందుకు సిద్దం అవుతున్నారు .. మీకు ఆ ఆలోచన ఉందా అని మహేష్‌ను ప్రశ్నించగా .. ప్రస్తుతానికి వెబ్ సిరీస్‌ల్లో నటించాలనే ఆసక్తి ఉద్దేశ్యం తనకు లేదు అంటూ తేల్చి చెప్పాడు. కాని తాను వెబ్ సిరీస్‌లకు మాత్రం వ్యతిరేకం కాదని చెప్పాడు. వెబ్ సిరీస్‌లను తాను చూస్తాను అన్నాడు మహేష్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Balakrishna: బాలయ్య రిజెక్ట్ చేసిన సినిమాలు .. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం.. ఈ హీరోలకు వెరీవెరీ స్పెషల్

Most Eligible Bachelor: దసరా బరిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. రిలీజ్ డేట్ ప్రకటించిన అఖిల్.. ఎప్పుడంటే..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్.. ఫ్యాన్స్‏కు అదిరిపోయే న్యూస్..