Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gulab Cyclone: అవసరమైతే కేంద్రం నుంచి సాయం.. సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌.. ‘గులాబ్’ పరిస్థితులపై ఆరా..

PM Narendra Modi calls AP CM YS Jagan: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్‌’ తుఫాన్ తీరంవైపు కదులుతూ ఆందోళనకు గురిచేస్తోంది. వాయువ్య బంగాళాఖాతం, దానికి

Gulab Cyclone: అవసరమైతే కేంద్రం నుంచి సాయం.. సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌.. ‘గులాబ్’ పరిస్థితులపై ఆరా..
Ys Jagan, Pm Narendra Modi,
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 26, 2021 | 3:54 PM

PM Narendra Modi calls AP CM YS Jagan: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్‌’ తుఫాన్ తీరంవైపు కదులుతూ ఆందోళనకు గురిచేస్తోంది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ కేంద్ర బంగాళాఖాతం చుట్టూ ‘గులాబ్’ తుఫాన్ కేంద్రీకృతమై.. పశ్చిమ దిశగా కదులుతుంది. వాయువ్య, పశ్చిమ పశ్చిమ బంగాళాఖాతంలో 140 కిమీ తూర్పు – ఆగ్నేయంలో గోపాల్‌పూర్ & కళింగపట్నానికి తూర్పున 190 కి.మీ దూరంలో కదలాడుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సిబ్బందిని సైతం మోహరించిన చర్యలు చేపట్టింది. అయితే.. తుఫాన్ ఈరోజు రాత్రికి కళింగపట్నం-గోపాల్‌పూర్‌ మధ్య తుపాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 75-90 కి.మీ వేగంతో గాలులు వీయడంతోపాటు.. నష్టం కూడా వాటిల్లుతుందని అధికారులు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డితో మాట్లాడారు. ఈ సందర్భంగా తుఫాన్‌ నష్టం.. ప్రస్తుత పరిస్థితులు, తీసుకుంటున్న చర్యల గురించి ప్రధాని మోదీ.. సీఎం జగన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్‌ వేదిక వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడాను. గులాబ్ తుఫాను నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నాను. కేంద్రం నుంచి సాధ్యమైనంతమేరకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు ట్విట్టర్‌లో ప్రధాని మోదీ తెలిపారు. అందరి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానంటూ మోదీ తెలిపారు.

Also Read:

Gulab Cyclone Live Updates: గులాబ్ సైక్లోన్ లైవ్ అప్డేట్స్ : ప్రచండ వేగంతో దూసుకొస్తోన్న తుఫాను..

AP Politics: పవన్ కళ్యాణ్ ఏమైనా ఋషి పుంగవుడా?.. మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్..

రష్మికను బీట్‌ చేసి టాప్‌ పొజిషన్‌కి వస్తారా
రష్మికను బీట్‌ చేసి టాప్‌ పొజిషన్‌కి వస్తారా
ఈ వారం ఓటీటీ/థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
ఈ వారం ఓటీటీ/థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
బ్యాట్ అడిగిన ముషీర్‌కు కోహ్లీ గిఫ్ట్! సోషల్ మీడియాలో వైరల్
బ్యాట్ అడిగిన ముషీర్‌కు కోహ్లీ గిఫ్ట్! సోషల్ మీడియాలో వైరల్
ఈ పంట రైతు జీవితాన్నే మార్చేసింది.. లక్షల్లో ఆదాయం..!
ఈ పంట రైతు జీవితాన్నే మార్చేసింది.. లక్షల్లో ఆదాయం..!
పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియల తరువాత కొత్త పోప్‌ ఎంపిక
పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియల తరువాత కొత్త పోప్‌ ఎంపిక
పుట్టుకతోనే రాజయోగం ఉన్న రాశులు ఇవే..! వీరికి జీవితాంతం డబ్బే!!
పుట్టుకతోనే రాజయోగం ఉన్న రాశులు ఇవే..! వీరికి జీవితాంతం డబ్బే!!
సంపూర్ణేష్ బాబుకు అనారోగ్య సమస్యలు! అసలు విషయం చెప్పేశాడుగా
సంపూర్ణేష్ బాబుకు అనారోగ్య సమస్యలు! అసలు విషయం చెప్పేశాడుగా
రోడ్డు ప్రమాదంలో గాయపడిన గోవుకు చికిత్స చేయించిన న్యాయమూర్తి...
రోడ్డు ప్రమాదంలో గాయపడిన గోవుకు చికిత్స చేయించిన న్యాయమూర్తి...
కాజోల్ కూతురిని చూశారా.. ? అందాల అరాచకమే ఈ అమ్మడు..
కాజోల్ కూతురిని చూశారా.. ? అందాల అరాచకమే ఈ అమ్మడు..
పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా.?పొరపాటున కూడా
పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా.?పొరపాటున కూడా