Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chinese-Taiwan: దుష్ట చైనా దుష్ట పన్నాగం.. రెండు రోజులుగా తైవాన్‌‌ను భయపెడుతున్న డ్రాగన్ కంట్రీ..

చీ.. ఇందేంటని ప్రపంచ దేశాలు అంటున్నా తన పాడు పనిని మాత్రం డ్రాగన్ కంట్రీ కొనసాగిస్తోంది. చుట్టుపక్కల దేశాలను ఆక్రమిస్తోంది. సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తోంది.

Chinese-Taiwan: దుష్ట చైనా దుష్ట పన్నాగం.. రెండు రోజులుగా తైవాన్‌‌ను భయపెడుతున్న డ్రాగన్ కంట్రీ..
Chinese Sends Jets Into Tai
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 03, 2021 | 1:10 PM

దురాక్రమణను కొనసాగిస్తోంది చైనా.  చీ.. ఇందేంటని ప్రపంచ దేశాలు అంటున్నా తన పాడు పనిని మాత్రం డ్రాగన్ కంట్రీ కొనసాగిస్తోంది. చుట్టుపక్కల దేశాలను ఆక్రమిస్తోంది. సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తోంది. కొన్ని దేశాలను అప్పుల కుప్పగా మార్చేస్తోంది. మరికొన్నింటిలో పరోక్షంగా చిచ్చు పెడుతోంది. మరోచోట అభివృద్ధి పేరుతో దేశంలోకి అడుగులు వేస్తోంది. అలా.. కాదు.. కూడదంటే ఆయుద ప్రయోగం చేస్తోంది. తాజాగా శనివారం తైవాన్‌పై బల ప్రయోగం చేసింది. తైవాన్ వైపు 39 జెట్‌లను పంపి బల ప్రదర్శనను చేసింది. రెండు రోజుల్లో చైనాకు ఇది రెండో అతిపెద్ద శక్తి ప్రదర్శన. ఉదయం, రాత్రి రెండు సార్లు 39 విమానాలు తైవాన్ వాయు రక్షణ ప్రాంతంలోకి ప్రవేశించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. స్వయం పాలక ద్వీపంకు దక్షిణ భాగంలోకి 38 విమానాలను పంపింది. చైనా తైవాన్ (చైనా-తైవాన్ సంబంధాలు) పై తన వాదనను వినిపిస్తుంది.

అంతర్యుద్ధం తర్వాత 1949 లో విభజన తరువాత చైనా ‘కమ్యూనిస్ట్’ మద్దతుదారులు ఆక్రమించింది.  దాని ప్రత్యర్థి ‘నేషనలిస్ట్’ మద్దతుదారులు తైవాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ తన పాలనకు 72 వ వార్షికోత్సవాన్ని శుక్రవారం జరుపుకుంది. మొదటి రోజు చైనా పంపిన విమానాలపై తైవాన్ ప్రధాన మంత్రి సు టెంగ్-చాంగ్ శనివారం తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. “ప్రాంతీయ శాంతికి హాని కలిగించడానికి చైనా  అనాగరిక ప్రయత్నిస్తోంది” అని దక్షిణ తైవాన్‌లోని ఓ సైన్స్ పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా అన్నారు

భారీ సంఖ్యలో విమానాలు..

చైనా ఒక సంవత్సరానికి పైగా తైవాన్‌కు దక్షిణాన సైనిక విమానాలను పంపుతోంది. తైవాన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ శుక్ర, శనివారాల్లో మొత్తం 39 విమానాలు తైవాన్ మీదుగా ప్రయాణించాయని వారు తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. శనివారం పగటి సమయంలో 20 విమానాలు, రాత్రి మరో 19 విమానాలు ఇలా వరుసగా వచ్చాయని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తన నివేదకలో తెలిపింది. వాటిలో ఎక్కువ భాగం J-17, SU-30 యుద్ధ విమానాలుగా వారు గుర్తించినట్లుగా పేర్కొంది. చైనా తన యుద్ధ విమానాల ద్వారా తైవాన్‌ను భయపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంది. తైవాన్ అమెరికాకు సన్నిహితంగా ఉంటోంది. కేవలం ఈ ఒక్క కారణంగా చైనా దానిపై గుర్రుగా ఉంది.

గత వారం కూడా చైనా..

అంతకుముందు, శుక్రవారం దాని జాతీయ దినోత్సవం సందర్భంగా, చైనా తన శక్తి ప్రదర్శనలో 25 యుద్ధ విమానాలను తైవాన్ వైపు పంపింది. చైనా  పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) కు చెందిన 18 J-16 యుద్ధ విమానాలు, రెండు H-6 బాంబర్లు తైవాన్ వైపు వెళ్లినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతిస్పందనగా, తైవాన్ వాయు గస్తీని మోహరించింది. దాని వాయు రక్షణ వ్యవస్థ ద్వారా చైనా విమానాలను గుర్తించింది. గత వారం కూడా PLA 24 ఫైటర్ జెట్‌లను తైవాన్‌కు పంపింది. చైనీస్ అధికారులు తైవాన్ కోసం తాము బలాన్ని ప్రదర్శించాల్సి ఉన్నప్పటికీ, ఆక్రమించుకుంటూనే ఉంటామని చాలాసార్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి: Maharashtra NCB Raid: వీకెండ్‌ మత్తు మజాలో వాణిజ్య నగరం.. పట్టుబడిన బాలీవుడ్‌ స్టార్‌ హీరో పుత్రరత్నం..