Maharashtra NCB Raid: వీకెండ్ మత్తు మజాలో వాణిజ్య నగరం.. పట్టుబడిన బాలీవుడ్ స్టార్ హీరో పుత్రరత్నం..
ముంబైలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసిన ఎన్బీబీ. ఎస్.. ముంబైలో ఎన్సీబీ బడా ఆపరేషన్ చేపట్టింది. ముంబై పోర్టులోని కార్డీలియా క్రూయిజ్ షిప్‌లో పార్టీ జరుగుతుండగా రైడ్ చేసారు ఎన్సీబీ అధికారులు.
ముంబైలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసిన ఎన్బీబీ. ఎస్.. ముంబైలో ఎన్సీబీ బడా ఆపరేషన్ చేపట్టింది. ముంబై పోర్టులోని కార్డీలియా క్రూయిజ్ షిప్‌లో పార్టీ జరుగుతుండగా రైడ్ చేసారు ఎన్సీబీ అధికారులు. పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఇన్ఫర్మేషన్ రావడంతో దాడులు చేసి 10మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా కొకైన్, MD డ్రగ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
అయితే.. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అరెస్టులు సంచలనంగా మారాయి. ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్ స్టార్ హీరో కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరో..? ఆ హీరో కుమారుడితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు..? అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు ఎన్సీబీ అధికారులు.
గత కొంతకాలంగా ముంబై దాడులు ముమ్మరం చేసింది ఎన్సీబీ. ఇందులో భాగంగానే సముద్రం మధ్యలో ఓ క్రూయిజ్ షిప్‌లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఉన్నాయన్న సమాచారంతో సోదాలు నిర్వహించింది. ఈ క్రూయిజ్‌లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీకి సంపన్న కుటుంబాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరైనట్టు తెలుస్తొంది. ఈ పార్టీకి దాదాపు 1500మంది వరకు హాజరైనట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి: NRI News: వర్జీనియాలో ప్రవాస భారతీయుల మహాసభ.. హాజరైన కమలా హారిస్ భర్త..