Railway Passengers Alert: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే ఆ ట్రైన్స్ నెంబర్లు మారాయి..
తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ల నెంబర్లు మారాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో ఏయే రైళ్ల నెంబర్లు మారాయో వివరాలు తెలిపింది. అయితే ఇప్పటికిప్పుడే కాకుండా..
Indian Railways News: తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ల నెంబర్లు మారాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో ఏయే రైళ్ల నెంబర్లు మారాయో వివరాలు తెలిపింది. అయితే ఇప్పటికిప్పుడే కాకుండా.. 2022 జనవరి మాసం నుంచి ఈ మారిన రైళ్ల నెంబర్లు అమలులోకి రానున్నాయి. మారిన రైళ్ల నెంబర్లను రైల్వే ప్రయాణీకులు పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. రిజర్వేషన్ల సమయంలో ప్రయాణీకులు గందరగోళానికి గురికాకుండా మారిన రైళ్ల నెంబర్లపై రైల్వే అధికారులు ప్రచారం కల్పిస్తున్నారు.
హౌరా నుంచి మైసూరుకు నడిచే రైలు నెంబర్ 08117(పాత నెంబర్)ను జనవరి 7వ తేదీ నుంచి 08017 (కొత్త నెంబర్)గా మార్చారు. అలాగే మైసూరు నుంచి హౌరాకు నడిచే నెంబర్.08118ను 08018గా మార్చారు. ఇది జనవరి 9 నుంచి అమలులోకి రానుంది.
కాగా షాలిమర్ నుంచి హైదరాబాద్‌కు నడిచే రైలు నెంబర్.08645 జనవరి 2వ తేదీ నుంచి నెంబర్. 08045గా మారనుంది. హైదరాబాద్ నుంచి షాలిమర్‌కు నడిచే రైలు నెంబర్.08646 జనవరి 4 నుంచి నెంబర్.08046గా మారనుంది.
దక్షిణ మధ్య రైల్వే ట్వీట్..
Change in Train Number @drmhyb @drmsecunderabad @VijayawadaSCR pic.twitter.com/YMIdChepAZ
— South Central Railway (@SCRailwayIndia) October 3, 2021
Also Read..
IIM Recruitment: అమృత్‌సర్ ఐఐఎంలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
Weekly Horoscope: వార ఫలాలు.. ఈ రాశివారికి తొందరపాటు నిర్ణయాలు పనికి రావు.. జాగ్రత్తగా ఉండాలి