IPL 2021 RCB vs PBKS Live Streaming: చావో రేవో.. షార్జా వేదికగా ఉత్కంఠ మ్యాచ్.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా.. చూడాలో తెలుసుకోండి

సమవుజ్జీలమధ్య రసవత్తరమైన పోరుకు షార్జా క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ మధ్య ఉత్కంఠకు తెరలేవనుంది.

IPL 2021  RCB vs PBKS Live Streaming: చావో రేవో.. షార్జా వేదికగా ఉత్కంఠ మ్యాచ్.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా.. చూడాలో తెలుసుకోండి
Royal Challengers Bangalore
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 03, 2021 | 7:04 AM

ఐపీఎల్ 2021లో ఆదివారం రెండు ఉత్కంఠ పోరుకు తెరలేవనుంది. ఈ రోజు మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- పంజాబ్ కింగ్స్ మధ్య రసవత్తరంగా జరుగనుంది . ప్లేఆఫ్ పరంగా ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 11 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు గెలిచింది. ఈ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ జట్టు 12 మ్యాచ్‌ల్లో ఐదు గెలిచింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌తో 10 పాయింట్లతో సమంగా ఉంది. ఈ మ్యాచ్ వారికి డూ ఆర్ డై మ్యాచ్‌ చెప్పవచ్చు. రెండు జట్ల మధ్య జరిగిన విజయాలను మనం ఓ సారి పరిశీలిస్తే.. పంజాబ్‌ జట్టు ఆధిక్యంలో ఉంది. ఇద్దరి మధ్య మొత్తం 27 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో పంజాబ్ 15, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచ్‌లు గెలిచింది. పంజాబ్ కింగ్స్ ఆదివారం ఆర్‌సీబీ తో తలపడినప్పుడు వారి పరిస్థితి డూ-డై లాగా ఉంటుంది.

RCB – పంజాబ్ మధ్య గట్టి పోటీ

మరో రెండు పాయింట్లతో RCB దాదాపు ప్లే-ఆఫ్‌లో స్థానాన్ని నిర్ధారిస్తుంది. పంజాబ్ కింగ్స్ మునుపటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై మంచి విజయాలను నమోదు చేసింది. గ్లెన్ మాక్స్‌వెల్, శ్రీకర్ భరత్, విరాట్ కోహ్లీ బెంగళూరులో బ్యాటింగ్‌లో మంచి స్వింగ్‌లో కనిపిస్తున్నారు. అదే సమయంలో హర్షల్ పటేల్ బౌలింగ్‌ లైన్ అండ్ లెంథ్‌లో పడుతోంది.  మరోవైపు పంజాబ్‌లో కెఎల్ రాహుల్, మయాంక్ పూర్తి నియంత్రణలో ఉన్నారు. అదే సమయంలో అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రాణిస్తున్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 2 ఆదివారం జరుగుతుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఏ సమయంలో ప్రారంభమవుతుంది?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. రాత్రి 7 గంటలకు టాస్ వేస్తారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ షార్జాలోని షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ ఉంటుంది?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయబడతాయి. లైవ్ స్ట్రీమింగ్ హాట్‌స్టార్‌లో ఉంటుంది.

ఇరు జట్ల సభ్యుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), నవదీప్ సైనీ, గ్లెన్ మాక్స్‌వెల్, డాన్ క్రిస్టియన్, రజత్ పటీదార్, దుష్మంత్ చమీరా, పవన్ దేశ్‌పాండే, మహ్మద్ సిరాజ్, హర్షాల్ పటేల్, మహమ్మద్ అజారుద్దీన్, సచిన్ బేబీ, వనిందు హసరంగ, జార్జ్ గార్టెన్, యుజ్వేంద్ర చాహల్, షాబాజ్ అహ్మద్, దేవదత్ పాడిక్కల్, కైల్ జేమ్సన్, సుయాష్ ప్రభుదేశాయ్, శ్రీకర్ భరత్, టిమ్ డేవిడ్, ఆకాష్ దీప్ మరియు AB డివిలియర్స్.

పంజాబ్ కింగ్స్: లోకేష్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, అర్షదీప్ సింగ్, ఇషాన్ పోరెల్, షారూఖ్ ఖాన్, మహ్మద్ షమీ, నాథన్ ఎల్లిస్, ఆదిల్ రషీద్, మురుగన్ అశ్విన్, హర్‌ప్రీత్ బ్రార్, మొయిసెస్ హెన్రిక్స్, క్రిస్ జోర్డాన్, ఐదేన్ మార్క్రామ్, మన్ దీప్ సింగ్, దర్శన్ నల్కండే, ప్రభాసిమ్రాన్ సింగ్, రవి బిష్ణోయ్, ఉత్కర్ష్ సింగ్, ఫాబియన్ అలెన్, సౌరభ్ కుమార్ మరియు జలజ్ సక్సేనా

ఇవి కూడా చదవండి: Samantha – Naga Chaitanya: ఉత్కంఠకు తెర.. సమంత- నాగచైతన్య విడాకులు.. అధికారిక ప్రకటన