IPL 2021, RR vs CSK Match Result: ధోని సేనకు చుక్కలు.. 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం.. అర్థ సెంచరీలతో ఆకట్టుకున్న జైస్వాల్, దుబే

IPL 2021, RR vs CSK Match Result: 190 పరుగుల భారీ స్కోర్‌ను ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్స్ ఏ దశలోనూ ఒత్తికి గురి కాకుండా ఫియర్ లెస్ బ్యాటింగ్ చేస్తూ విజయాన్ని సాధించారు.

IPL 2021, RR vs CSK Match Result: ధోని సేనకు చుక్కలు.. 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయం.. అర్థ సెంచరీలతో ఆకట్టుకున్న జైస్వాల్, దుబే
Ipl 2021 Rr Vs Csk
Follow us

|

Updated on: Oct 02, 2021 | 11:33 PM

IPL 2021, RR vs CSK Match Result: 190 పరుగుల భారీ స్కోర్‌ను ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్స్ ఏ దశలోనూ ఒత్తికి గురి కాకుండా ఫియర్ లెస్ బ్యాటింగ్ చేస్తూ విజయాన్ని సాధించారు. నిర్ణీత లక్ష్యాన్ని కేవలం 17.3 ఓవర్లోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించి అద్భుత విజయాన్ని అందకున్నారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి చేరుకుంది. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు ఇయాన్ లీవిస్ (27 పరుగులు, 12 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు), జైస్వాల్(50పరుగులు, 6 ఫోర్లు, 3 సిక్సులు) ఐపీఎల్ 2021లోనే తొలి పవర్ ప్లేలో 12 పైగా పరుగులు సాధించారు. ఇద్దరూ కలిసి కేవలం 5.2 ఓవర్లోనే 77 పరుగులు సాధించారు. అనంతరం భారీ షాట్ ఆడే క్రమంలో ఠాకూర్ బౌలింగ్‌లో హజల్‌వుడ్ అద్బుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు.

అనంతరం జైస్వాల్ కూడా తన అర్థ సెంచరీ పూర్తి చేశాక అసిఫ్ బౌలింగ్‌లో టీం స్కోర్ 81 పరుగుల వద్ద వికెట్‌ను కోల్పోయాడు. ఓపెనర్ల దూకుడు బ్యాటింగ్‌ను కంటిన్యూ చేస్తూ తరువాత క్రీజులోకి వచ్చిన శాంసన్, శివం దుబే(64 పరుగులు, 42 బంతులు, 4 ఫోర్లు, 4 సిక్సులు) చెన్నై బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీలు సాధించారు. ఇద్దరూ కలిసి 90 పరుగుల భాగస్వామ్యం సాధించి మ్యాచులో పట్టు సాధించేలా చేశారు. అయితే, భారీ షాట్ ఆడే క్రమంలో శాంసన్ 28 (24 బంతులు, 4 ఫోర్లు) పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్న శివం దుబే కేవలం 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సుల సహాయంతో తన తొలి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాజస్థాన్ తరుపున కీలక ఇన్నింగ్స్ ఆడుతూ.. చెన్నై విధించిన భారీ స్కోర్‌ను చాలా చిన్నదిగా చేస్తూ.. రాజస్థాన్ టీంను విజయానికి చేర్చాడు. చెన్నై బౌలర్లలో ఠాకూర్ 2, అసిఫ్ 1 వికెట్ పడగొట్టారు.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స టీం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ తొలి పవర్ ప్లే వరకు అద్భుతంగా ఆడి మంచి భాగస్వామ్యాన్ని అందించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సుల సహాయంతో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతోన్న రుతురాజ్ పరుగులు సాధిస్తూ రాజస్థాన్ బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేయడంలో రుతురాజ్ కీలక పాత్ర పోషించాడు. జడేజా కూడా చివరి ఓవర్ల బౌండరీల మోత మోగించాడు. 213 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించి, కేవలం 15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సహాయంతో 32 పరుగులు చేశాడు.

6.5 ఓవర్లో డుప్లెసిస్ (25 పరుగులు, 19 బంతులు, 2 ఫోర్లు, 1 సిక్స్) రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో రుతురాజ్, డుప్లెసిస్ 47 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సురేష్ రైనా (3) మరోసారి నిరాశ పరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అలీ (21), రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి మరోసారి కీలక భాగస్వామ్యాన్ని నిర్మించారు. టీం స్కోర్ 114 పరుగుల వద్ద అలీని రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అంబటి రాయుడు (2) కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరి నిరాశ పరిచాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్‌లో రాహుల్ తెవాటియా 3 వికెట్లు, చేతన్ సకారియా ఒక వికెట్ పడగొట్టారు.

Also Read: RR vs CSK, IPL 2021: రుతురాజ్ సెంచరీతో చెన్నై టీం భారీ స్కోర్.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 190

IPL 2021: క్రిస్‌ గేల్‌కి ఏమైంది.. ఎందుకు విఫలమవుతున్నాడు.. మాజీ ఆటగాళ్లు ఏం చెబుతున్నారు..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..