IPL 2021: క్రిస్ గేల్‌కి ఏమైంది.. ఎందుకు విఫలమవుతున్నాడు.. మాజీ ఆటగాళ్లు ఏం చెబుతున్నారు..
IPL 2021: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌కి ముందు డేంజర్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ బయోసెక్చర్‌ని విడిచిపెడుతున్నట్లు ప్రకటించారు. తాను చాలా కాలంగా
IPL 2021: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌కి ముందు డేంజర్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ బయోసెక్చర్‌ని విడిచిపెడుతున్నట్లు ప్రకటించారు. తాను చాలా కాలంగా బయో బబుల్‌లో ఉన్నానని, టీ 20 వరల్డ్ కప్‌లో ఉత్సాహంతో పాల్గొనేందుకు విరామం కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఈ నిర్ణయం వెనుక ఇతర కారణాలు కూడా ఉండవచ్చని మాజీ క్రికెటర్లు కెవిన్ పీటర్సన్, సునీల్ గవాస్కర్ అభిప్రాయ పడుతున్నారు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ 42 వ పుట్టినరోజు సందర్భంగా గేల్‌ని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తొలగించడం సరికాదని మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. ఐపీఎల్ రెండో దశలో గేల్ తొలి మ్యాచ్ ఆడలేదు. అయితే తర్వాతి రెండు మ్యాచ్‌లలో అతను పునరాగమనం చేశారు. కానీ పెద్దగా పరుగులు చేయలేకపోయారు. రెండు మ్యాచ్‌లలో కేవలం14, 1 పరుగులు చేశారు.
పీటర్సన్ ఏమన్నారు.. కోల్‌కత, పంజాబ్ మ్యాచ్‌కు ముందు పీటర్సన్ స్టార్ స్పోర్ట్స్‌లో మాట్లాడుతూ “ఈ వెస్టిండీస్ ఆటగాడు పంజాబ్ కింగ్స్ తరపున సరిగ్గా ఆడలేదు. అతడి పుట్టినరోజున కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు లభించలేదు. అయితే అతను సంతోషంగా లేనట్లయితే అతను కోరుకున్నది చేయనివ్వండి” అంటూ తెలిపారు.
గేల్ గేమ్ ఛేంజర్: సునీల్ గవాస్కర్ గేల్ తన కష్ట సమయాల్లో పంజాబ్ కింగ్స్‌కు మద్దతుగా ఉండాలని గవాస్కర్ అన్నారు. క్రిస్ గేల్ ఒక గేమ్ ఛేంజర్. అతను జట్టులో లేనట్లయితే పెద్ద నష్టం. అతను జట్టు లోపల ఉన్నాడా లేదా బయట ఉన్నాడా నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా అతనికి 40 ఏళ్లు పైబడి ఉంటాయి. గేల్‌కు ఆటను మార్చే సామర్థ్యం ఉంది. అది మాత్రం మరిచిపోవద్దని గుర్తు చేశారు.
గేల్ చాలా రోజులు బయోబబుల్‌లో ఉన్నారు.. గేల్ కొన్ని నెలలుగా కరేబియన్ ప్రీమియర్ లీగ్ బబుల్.. ఆ తర్వాత ఐపీఎల్ బబుల్‌లో ఉన్నారు. దీంతో చాలా అలసిపోయారు. అతను కుటుంబంతో గడపడానికి, విశ్రాంతి తీసుకోవడానికి IPL నుంచి నిష్క్రమించారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం జట్టులోని ఆటగాళ్లందరూ కఠినమైన నియమాలను పాటించాల్సిన విషయం తెలిసిందే.
#PBKS respects and supports the decision of @henrygayle.
Wishing him all the success for the upcoming #T20WorldCup!#SaddaPunjab #IPL2021 #PunjabKings https://t.co/QmTqhd8w6k
— Punjab Kings (@PunjabKingsIPL) September 30, 2021