RR vs CSK, IPL 2021: రుతురాజ్ సెంచరీతో చెన్నై టీం భారీ స్కోర్.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 190

RR vs CSK: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స టీం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

RR vs CSK, IPL 2021: రుతురాజ్ సెంచరీతో చెన్నై టీం భారీ స్కోర్.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 190
Ipl 2021 Rr Vs Csk, Ruturaj Gaikwad
Follow us
Venkata Chari

|

Updated on: Oct 02, 2021 | 9:40 PM

RR vs CSK, IPL 2021: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స టీం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ తొలి పవర్ ప్లే వరకు అద్భుతంగా ఆడి మంచి భాగస్వామ్యాన్ని అందించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సుల సహాయంతో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతోన్న రుతురాజ్ పరుగులు సాధిస్తూ రాజస్థాన్ బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేయడంలో రుతురాజ్ కీలక పాత్ర పోషించాడు. జడేజా కూడా చివరి ఓవర్ల బౌండరీల మోత మోగించాడు. 213 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించి, కేవలం 15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సహాయంతో 32 పరుగులు చేశాడు.

6.5 ఓవర్లో డుప్లెసిస్ (25 పరుగులు, 19 బంతులు, 2 ఫోర్లు, 1 సిక్స్) రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో రుతురాజ్, డుప్లెసిస్ 47 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సురేష్ రైనా (3) మరోసారి నిరాశ పరిచాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన అలీ (21), రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి మరోసారి కీలక భాగస్వామ్యాన్ని నిర్మించారు. టీం స్కోర్ 114 పరుగుల వద్ద అలీని రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అంబటి రాయుడు (2) కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరి నిరాశ పరిచాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్‌లో రాహుల్ తెవాటియా 3 వికెట్లు, చేతన్ సకారియా ఒక వికెట్ పడగొట్టారు.

Also Read: IPL 2021: క్రిస్‌ గేల్‌కి ఏమైంది.. ఎందుకు విఫలమవుతున్నాడు.. మాజీ ఆటగాళ్లు ఏం చెబుతున్నారు..

31 బంతుల్లో సెంచరీ.. 11 సిక్సర్లు, 8 ఫోర్లు.. బౌలర్లను ఊచకోత కోసిన ఈ బ్యాట్స్‌మెన్‌ ఎవరంటే..?

IPL 2021, MI vs DC Match Result: లో స్కోరింగ్ మ్యాచ్.. చివరి ఓవర్‌ వరకు సాగిన ఉత్కంఠ.. 4 వికెట్ల తేడాతో ఢిల్లీదే విజయం