విమానయాన నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం.. అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు.. వీడియో

గత ఏడాదిన్నర నుంచి ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టినా దేశంలో వైరస్‌ ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది.

విమానయాన నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం.. అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు పొడిగింపు.. వీడియో

|

Updated on: Oct 03, 2021 | 9:42 AM

గత ఏడాదిన్నర నుంచి ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టినా దేశంలో వైరస్‌ ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కమర్షియల్‌ విమాన సర్వీసుల రద్దును అక్టోబర్‌ 31 వరకూ కొనసాగించనున్నట్టు పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ వెల్లడించింది. కార్గో విమానాలతో పాటు ఎంపిక చేసిన కొన్ని రూట్లలో మాత్రం ప్రయాణికుల విమానాలు నడపనున్నట్టు తెలిపింది. కరోనా కట్టడిలో భాగంగా గతేడాది మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సర్వీసులను నిలిపివేశారు. ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేస్తూ దశలవారీగా సెప్టెంబర్‌ 30 వరకూ పొడిగిస్తూ వచ్చారు. తాజాగా మరోసారి వివాన సర్వీసుల రద్దు గడువును పొడిగించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అక్టోబర్‌ నెలాఖరు వరకు విమానాల రద్దు నిర్ణయాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటనలో తెలిపింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: నెలలో దాదాపు 900 కోట్లు సంపాదించారు.. ఎలా సాధ్యం? వీడియో

Viral Video: ఆ కాలేజీపై పగబట్టిన పాములు.. అసలు ఏం జరిగిందంటే..?? వీడియో

Follow us