East London Nightclub: వీకెండ్ నైట్ క్లబ్‌లో దారుణం.. 17 మంది అనుమానాస్పద స్థితిలో మృతి
ఈస్ట్‌లండన్‌లోని సీనరీ పార్క్‌లో క్లబ్ లో మృత దేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఎటువంటి గాయాలు లేవని నేలపై కుప్పకూలి పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు కథనం.
East London Nightclub: దక్షిణాఫ్రికాలోని ఈస్ట్‌లండన్ సిటీలో దారుణం వెలుగులోకి వచ్చింది. వీకెండ్ నైట్ క్లబ్‌లో 17 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన ఈస్ట్‌లండన్‌లోని సీనరీ పార్క్‌లో చోటు చేసుకొంది. ఆదివారం తెల్లవారుజామున ఎన్యోబెని టావెర్న్ క్లబ్‌లో మృతదేహాలు పడిఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల శరీరాలపై గాయాలు లేకపోవడంతో.. మరణానికి కారణాలు వెంటనే చెప్పలేమని పోలీసు అధికారులు అంటున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని చెబుతున్నారు. క్లబ్ లో మృత దేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఎటువంటి గాయాలు లేవని నేలపై కుప్పకూలి పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు కథనం.
సీనరీ పార్క్ సిటీ సెంటర్ నుండి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఘటనపై ఈస్టర్న్ కేప్ పోలీసు ప్రతినిధి బ్రిగేడియర్ టెంబిన్‌కోసి కినాన స్పందించారు. ఈస్ట్ లండన్‌లో ఉన్న సీనరీ పార్క్‌లోని సుమారు 17 మంది మరణించినట్లు మాకు నివేదిక వచ్చింది. మేము ఇప్పటికీ సంఘటన చుట్టూ ఉన్న పరిస్థితులను పరిశీలిస్తున్నాము అని అన్నారు.
మరోవైపు, మృతుల బంధువులు ఆ ప్రాంతానికి చేరుకొని తమ బిడ్డల మృతదేహాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుల సంఖ్య 22 వరకు ఉండొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. పదు సంఖ్యలో మృత్యువాతకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది 18 నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్న యువకులేనని బ్రిగేడియర్ కినానా చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..