- Telugu News Photo Gallery World photos Schloss Elmau hotel 9 restaurants no air conditioning and no plastic G7 summit is here all you need to know
Schloss Elmau Hotel: ఏసీ కూడా లేని ఈ హోటల్‌లో జీ9 శిఖరాగ్ర సమావేశం..ఈ హోటల్ ప్రత్యేకత ఏమిటో తెలుసా
Schloss Elmau Hotel : G-7 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు ప్రపంచ నేతలు, ప్రధాని మోడీ జర్మనీ చేరుకున్నారు. జర్మనీలోని ష్లోస్ ఎల్మౌ హోటల్‌లో జి-7 శిఖరాగ్ర సమావేశానికి.. నేతల బసకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. G-7 శిఖరాగ్ర సమావేశానికి వేదికగా మారిన ఈ హోటల్ విశేషాలు మీ కోసం
Updated on: Jun 26, 2022 | 8:08 PM

G-7 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు ప్రపంచం నలుమూలల నుండి ప్రముఖ నాయకులు, మన ప్రధాని మోడీ జర్మనీ చేరుకున్నారు. జర్మనీలోని ష్లోస్ ఎల్మౌ హోటల్‌లో జి-7 శిఖరాగ్ర సమావేశానికి.. నేతల బసకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ హోటల్ చాలా రకాలుగా ప్రత్యేకమైనది. దక్షిణ జర్మనీలోని మ్యూనిచ్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన ఈ హోటల్ చుట్టూ అందమైన కొండలతో చూపరులను ఆకట్టుకుంటుంది.

జర్మనీ వెబ్‌సైట్ DW ప్రకారం, ష్లోస్ ఎల్మౌ హోటల్‌లో AC లేదా ప్లాస్టిక్‌ని ఉపయోగించరు. పింగాణీ సీసాలను సౌందర్య ఉత్పత్తులకు ఉపయోగిస్తారు. ఆహారం, పానీయాలు గాజు పాత్రలలో వడ్డిస్తారు. అంతేకాదు గదులలో కూడా ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ని ఉపయోగించరు.

జనసమూహానికి దూరంగా ఉండటంతో పాటు.. చుట్టూ కొండలు ఉండడం వల్ల ఇక్కడ కాలుష్యం ఉండదు. కొండల కారణంగా ఇక్కడ ఉష్ణోగ్రతలు అంతగా అధికంగా ఉండదు కనుక ఎయిర్ కండీషనర్ ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఈ హోటల్‌లో లైబ్రరీతో సహా అనేక విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి.

ఇక్కడ కాన్సర్ట్ హాల్ చాలా పెద్దది, జర్మనీలో పెద్ద పెద్ద సమావేశాలను ఇది వేదికగా మారుతుంది. తాజాగా జి-7 శిఖరాగ్ర సమావేశాన్ని కూడా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ హోటల్‌ను 1914- 1916 మధ్య బిల్డర్ జోహన్నెస్ ముల్లర్ నిర్మించారు. జోహన్నెస్ సెమిటిక్ వ్యతిరేకి, హిట్లర్ దేవుడు పంపిన నాయకుడని అతను నమ్మాడు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, హిట్లర్‌ను కీర్తిస్తున్నందుకు జోహన్నెస్‌ను US సైన్యం అరెస్టు చేసింది. హోటల్ ను ఆక్రమించింది.

1961లో జోహన్నెస్ ముల్లర్ శిక్షకు వ్యతిరేకంగా అతని సంతానం అప్పీల్ చేశారు. జోహన్నెస్ ముల్లర్ విజయం సాధించాడు. మళ్ళీ హోటల్‌ను స్వాధీనం చేసుకున్నాడు. జోహన్నెస్ ముల్లర్ మనవడు, డైట్మార్ ముల్లర్ ప్రస్తుత హోటల్ యజమాని. అతనికి ఏనుగులంటే అమితమైన ప్రేమ. ఏనుగులు సూక్ష్మగ్రహి అని, మంచి మనస్సు , జ్ఞాపకశక్తికి ప్రతీక అని వారు నమ్ముతారు. కర్టెన్ల నుంచి తివాచీల వరకు ఎక్కడ చూసినా ఏనుగుల బొమ్మలు కనిపించడానికి కారణం ఇదే.





























