AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Magic: మాల్దీవులు అధ్యక్షుడు ముయిజుపై చేతబడి చేసిందని మంత్రి పై ఆరోపణలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

దేశ అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ముయిజ్జూపై చేతబడి చేయించిందంటూ షమ్నాజ్‌ను అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి" అని స్థానిక మీడియా సంస్థ సన్ తెలిపింది. అయితే వార్తల పత్రికల కధనాలను ఇది నిజం అంటూ పోలీసులు ధృవీకరించలేదు.. అదే సముయంలో వార్తలు అబద్ధం అంటూ తిరస్కరించలేదు. వాతావరణ సంక్షోభంలో ముందు వరుసలో ఉన్న దేశం మాల్దీవులు. ఇలాంటి దేశానికి పర్యావరణ శాఖ మంత్రి గా  ఫాతిమత్ షమ్నాజ్ అలీ ఒక ముఖ్యమైన స్థానంలో ఉన్నారు. UN పర్యావరణ నిపుణులు సముద్ర నీటి మట్టాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయని హెచ్చరించడంతో పాటు వాస్తవంగా మాల్దీవులు ఈ శతాబ్దం చివరి నాటికి నివాసయోగ్యం కాదని హెచ్చరించారు.

Black Magic: మాల్దీవులు అధ్యక్షుడు ముయిజుపై చేతబడి చేసిందని మంత్రి పై ఆరోపణలు.. అరెస్ట్ చేసిన పోలీసులు
Black Magic On President Muizzu
Surya Kala
|

Updated on: Jun 28, 2024 | 10:40 AM

Share

హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశం నిత్యం ఏదోక ఆరోపణలతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ముయిజ్జూపై బ్లాక్ మ్యాజిక్ చేసినట్లు ఆ దేశ మీడియా ఆరోపించింది. ఈ దారుణ ఘటనకు కారణమైన ఆ దేశ పర్యావరణ మంత్రిని మాల్దీవుల్లోని పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. పర్యావరణ, వాతావరణ మార్పులు, ఇంధన శాఖ మంత్రి ఫాతిమత్ షమ్నాజ్ అలీ సలీమ్‌తో పాటు మరో ఇద్దరిని రాజధాని మాలేలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ కోసం వారం రోజుల పాటు ఆమెను రిమాండ్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అయితే మంత్రి అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దేశ అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ముయిజ్జూపై చేతబడి చేయించిందంటూ షమ్నాజ్‌ను అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి” అని స్థానిక మీడియా సంస్థ సన్ తెలిపింది. అయితే వార్తల పత్రికల కధనాలను ఇది నిజం అంటూ పోలీసులు ధృవీకరించలేదు.. అదే సముయంలో వార్తలు అబద్ధం అంటూ తిరస్కరించలేదు.

వాతావరణ సంక్షోభంలో ముందు వరుసలో ఉన్న దేశం మాల్దీవులు. ఇలాంటి దేశానికి పర్యావరణ శాఖ మంత్రి గా  ఫాతిమత్ షమ్నాజ్ అలీ ఒక ముఖ్యమైన స్థానంలో ఉన్నారు. UN పర్యావరణ నిపుణులు సముద్ర నీటి మట్టాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయని హెచ్చరించడంతో పాటు వాస్తవంగా మాల్దీవులు ఈ శతాబ్దం చివరి నాటికి నివాసయోగ్యం కాదని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

ముస్లింలు మెజారిటీగా ఉన్న మాల్దీవులలో శిక్షాస్మృతి ప్రకారం చేతబడి అనేది క్రిమినల్ నేరం కాదు. అయితే ఇస్లామిక్ చట్టం ప్రకారం ఈ నేరానికి ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుంది. ద్వీపసమూహం అంతటా ప్రజలు సాంప్రదాయ వేడుకలను విస్తృతంగా ఆచరిస్తారు. వీరు తమకు అనుకూలంగా.. ప్రత్యర్థులను శపించగలరని నమ్ముతారు.

62 ఏళ్ల మహిళను 2023 ఏప్రిల్‌లో మనధూలో ముగ్గురు పొరుగువారు కత్తితో పొడిచి చంపారు. ఆమె చేతబడి పూజలను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సుదీర్ఘ పోలీసు విచారణ తర్వాత మిహారు న్యూస్ సైట్ గత వారం ఓ నివేదికను వెల్లడించింది. హత్యకు గురైన వ్యక్తి చేతబడి చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యంకాలేదని పోలీసులు వెల్లడించారు.

2012లో తమ అఫీసుపై దాడి చేస్తున్న అధికారులపై నిర్వాహకులు “శపించబడిన రూస్టర్” విసిరారని ఆరోపించిన తరువాత పోలీసులు ప్రతిపక్ష రాజకీయ ర్యాలీపై విరుచుకుపడ్డారు.

మరిన్ని అంతర్జతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..